Balakrishna Vs Nagababu : వివాదానికి అసలు కారణం ఇదేనా ?

ఒక్క ఐడియా జీవితాన్ని మార్చినట్లు..ఒక చిన్న అపార్థం పెద్దగొడవనే సష్టిస్తోంది.

Last Updated : Jan 5, 2019, 09:22 PM IST
Balakrishna Vs Nagababu : వివాదానికి  అసలు కారణం ఇదేనా ?

బాలయ్య అంటే ఎవరో తనకు తెలియదని మెగా బద్రర్ నాగబాబు పేర్కొనడం వివాదంగా మారింది. అలాగే బాలకృష్ణ నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ పై తన ట్విట్టర్ ఖాతాలో నాగబాబు పరోక్ష విమర్శలు చేశారు. దీంతో వివాదం మరింత ముదిరింది. ఈ వ్యవహరం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా పెద్ద దూమారం రేగుతోంది. మెగా - బాలయ్య ఫ్యాన్స్ యూ ట్యూబ్, ఫేస్ బుస్ వేదికలపై మాటల వార్ చేసుకున్నారు. 

ప్రత్యక్ష వార్ షురూ

సోషల్ మీడియా వార్ కాస్త ప్రత్యక్ష వార్ కు దారి తీసేలా ఉంది. తాజాగా చెన్నై ఓ కార్యక్రమంలో పాల్గొన్న నాగబాబు ప్రసంగిస్తున్న సమయంలో జై బలాయ్య...జై బాలయ్య అంటూ ప్రసంగాన్ని అడ్డుకుకున్నారు. దీంతో బాలకృష్ణ  ఫ్యాన్స్ పై నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ వ్యవహారం టీవీ కార్యక్రమాల్లో చర్చకు దారి తీసింది..

వివాదంపై భిన్నవాదనలు

తాజా వివాదంపై మెగా అభిమాన సంఘం నేతలు స్పందిస్తూ పవన్ కల్యాణ్ అంటే ఎవరో తెలియది బాలకృష్ణ చెప్పినప్పుడు..  బాలకృష్ణ విషయంలో నాగబాబు చెబితే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. దీనిపై బాలకృష్ణ అభిమన సంఘం నేతలు స్పందిస్తూ పవన్ కల్యాణ్ విషయంలో బాలయ్య అలా అనలేదని ..పవన్ ఎన్నికల్లో పోటీ అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు.. ఈ విషయం తనకు తెలియనదని మత్రామే బాలయ్య చెప్పారు తప్పితే..పవన్ కల్యాణ్ ను  కించపరచాలనే ఉద్దేశం బాలకృష్ణకు లేదని వివరణ ఇచ్చారు. బాలయ్య వ్యాఖ్యలను తప్పుగా అర్థం చసుకొని నాగబాబు, మెగా ఫ్యాన్స్ రాద్ధాంతం చేయడం తగదని బాలయ్య అభిమనుల వ్యాఖ్యానిస్తున్నారు

ఇప్పటికైనా వివాదాన్ని ముగించాలి...

పవన్ విషయంలో బాలయ్య రాజకీయ కోణంలో చేసిన వ్యాఖ్యలా..లేదంటే యుగో హర్ట్ అయి చేసిన వ్యాఖ్యల అనేది ఇప్పడు చర్చనీయంశంగా మారింది. ఏది ఏమైనప్పటికీ పవన్ కల్యాణ్ పై బాలయ్య కామెంట్స్ చేయడం..దానికి నాగబాబు రియాక్ట్ అవడం..ఇలా వివాదానికి కారణం అయింది. 'తెలియదయనే పదవ వాడినంత మాత్రానా  పోయేది ఏమీ లేదని..ఎవరికున్న వాక్ స్వాతంత్య వారికి ఉంటుందని.. ఈ వివాదం ఇంతటితో ముగిస్తే బాటుందటని పలువురు మేధావులు సూచిస్తున్నారు.

Trending News