/telugu/photo-gallery/rain-alert-expected-in-these-4-key-districts-of-telugu-states-imd-weather-alert-issued-rn-180901 AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక 180901

YS Sharmila Fires on PM Modi: ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రేడియో గిఫ్ట్‌గా పంపించారు.  ఏపీ ప్రజల మన్ కి బాత్ వినాలని కోరారు. మోదీకి రాష్ట్రంలో అడుగుపెట్టే అర్హత లేదని.. ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని మోసం చేసి ఎన్నికల కోసం మళ్లీ కపట ప్రేమ చూపిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎన్నికల కోసం ఇన్ని సార్లు వచ్చిన మీరు.. అభివృద్ధి కోసం ఒక్కనాడైనా వచ్చారా..? అని ప్రశ్నించారు. దమ్ముంటే ఏపీ ప్రజలకు ఇప్పుడైనా ఇచ్చిన హామీలను అమలు చేస్తామని అఫిడవిట్ రాసి ఇవ్వాలన్నారు. 10 ఏళ్లలో మోదీ చేసిన మోసాలకు 10 ప్రశ్నలు సందిస్తున్నామన్నారు.

1) నాడు పార్లమెంటు సాక్షిగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా అని.. తర్వాత ఆ మాటమరిచి రాష్ట్రాన్ని వెన్నుపోటు పొడిచారు.

2) జగన్ రివర్స్ టెండెరింగును అడ్డుకోకుండా, పోలవరం ప్రాజెక్టు వినాశనానికి నాంది పలికారు, ఎత్తుతగ్గించే కుట్రలు కూడా చేస్తున్నారు 

3) మీ చేతులమీదుగా భూమిపూజ జరిపించుకున్న అమరావతి రాజధాని పదేళ్ల తర్వాత కూడా పూర్తి కాలేదు 

4) పోరాటాలు, ప్రాణార్పణ ద్వారా సాకారమైన విశాఖ ఉక్కును, అక్కడి సెంటిమెంటుకు విరుద్ధంగా అమ్మేద్దామని చూస్తూ, మళ్ళీ విశాఖ మీద దొంగ ప్రేమ ఒలకబోస్తున్నారు 
 
5) కడప స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్ వంటివి, విభజన చట్టంలో కాంగ్రెస్ ఇచ్చిన అనేక హామీలను తుంగలోతొక్కి, రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేసారు

6) మీ దత్తపుత్రుడు మద్యం సిండికేటు నడుపుతూ, కల్తీ మద్యంతో మనుషుల ప్రాణాలు తీస్తున్నా మీరు ఉలకలేదు, పలకలేదు. ఢిల్లీలో కేజ్రీవాల్ ను అరెస్టు చేసారు, ఇక్కడ మాత్రం ఎటువంటి చర్యలు లేవు

7) దేశంలో ఎస్సీ, ఎస్టీల రేజర్వేషన్లను అంతం చేయటానికి పూనుకున్నారు, మరియు రాష్ట్రంలో దళితులపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్నా, మీ కమీషన్లకు ఫిర్యాదులు చేస్తున్నా, మీరు రాష్ట్ర సర్కారును ప్రశ్నించలేదు, చర్యలకు ఉపక్రమించలేదు

8) ఇసుక, మద్యం, ఖనిజాలు, అక్రమ కాంట్రాక్టులు, దొంగదారిలో రాష్ట్రం చేస్తున్న అప్పులు, కేంద్ర ఇచ్చే నిధుల మళ్లింపు, ఇలా ఎటు చూసినా రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతున్నా, కేంద్రం నుండి ఎటువంటి చర్యలు లేవు

9) కర్నూలులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిబిఐ వచ్చి, చేతకాక, శాంతిభద్రతల సమస్యంటూ బెదిరి వెనుతిరిగింది. ఈ విషయంలో మీ సర్కారు మిన్నకుండి కూర్చోవటం యావత్ దేశానికే అవమానం

10) దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని మాటయిచ్చి, మాట తప్పి, దేశ యువతను, నిరుద్యోగులను ఘోరంగా మోసం చేశారు. 

'మోదీ, ఆంధ్రప్రదేశ్ ప్రజల మన్ కీ బాత్‌లో మీరు కచ్చితంగా దోషే. ఈ గడ్డ మీద అడుగుపట్టిన ప్రతిసారి ఇక్కడి ప్రజలను క్షమాపణ కోరండి' అని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.

Section: 
English Title: 
APPCC president YS Sharmila sent radio as gift to Prime Minister Narendra Modi kr
News Source: 
Home Title: 

YS Sharmila: ప్రధాని మోదీకి షర్మిల ఊహించని గిఫ్ట్.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్

YS Sharmila: ప్రధాని మోదీకి షర్మిల ఊహించని గిఫ్ట్.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
YS Sharmila: ప్రధాని మోదీకి షర్మిల ఊహించని గిఫ్ట్.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్
Publish Later: 
No
Publish At: 
Wednesday, May 8, 2024 - 11:14
Created By: 
Krindinti Ashok
Updated By: 
Krindinti Ashok
Published By: 
Krindinti Ashok
Request Count: 
46
Is Breaking News: 
No
Word Count: 
280