లడ్డూ కావాలా నాయనా..!!

'కరోనా వైరస్' లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా అన్నీ బంద్ చేశారు. చివరకు భగవంతుని సన్నిధులు కూడా కరోనా వైరస్ లాక్ డౌన్ కు అతీతం కాకుండా పోయాయి. దేశవ్యాప్తంగా ఆలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలు..ఇలా  ప్రార్థనా స్థలాలన్నీ మూతపడ్డాయి. దీంతో భక్తులు ప్రార్థనా స్థలాలకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది.  

Last Updated : May 27, 2020, 03:02 PM IST
లడ్డూ కావాలా నాయనా..!!

'కరోనా వైరస్' లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా అన్నీ బంద్ చేశారు. చివరకు భగవంతుని సన్నిధులు కూడా కరోనా వైరస్ లాక్ డౌన్ కు అతీతం కాకుండా పోయాయి. దేశవ్యాప్తంగా ఆలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలు..ఇలా  ప్రార్థనా స్థలాలన్నీ మూతపడ్డాయి. దీంతో భక్తులు ప్రార్థనా స్థలాలకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది.

ప్రస్తుతం లాక్ డౌన్ 4.0  కొనసాగుతోంది. మే 31 వరకు లాక్ డౌన్ 4.0 అమలులో ఉంటుంది. ఐతే ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆంక్షలతో చాలా రంగాల్లో కార్యకలాపాలకు అనుమతి ఇచ్చారు. కానీ ఇప్పటికీ ఆలయాలు, మసీదులు, చర్చిలు లాంటి ప్రార్థనా స్థలాలు తెరుచుకోలేదు. తెలుగు రాష్ట్రాల్లోనూ కీలక ఆలయాలు ఇప్పటికే మూసివేసే ఉన్నాయి. 

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్టాత్మకమైన ఆలయం తిరుమల. కోటాను కోట్ల భక్తులతో నిత్యం కిటకిటలాడుతుందీ క్షేత్రం.  కానీ ఇప్పుడు కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా.. నిత్య కైంకార్యాలను చూసేందుకు భక్తులకు అనుమతి లేదు. మరోవైపు సర్వశ్రేష్ఠమైన శ్రీవారి  లడ్డూ  ప్రసాదానికి భక్తులు దూరమవుతున్నారు. ఈ క్రమంలో  భక్తులకు శ్రీవారి ప్రసాదాన్ని అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం..TTD ఏర్పాట్లు  చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఉన్న TTD కళ్యాణ మండపాల ద్వారా శ్రీవారి లడ్డూ ప్రసాదాలను విక్రయాలను  ప్రారంభించింది. 

ఐతే టీటీడీ తీసుకున్ననిర్ణయంపై భక్తకోటి నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. శ్రీవారి లడ్డూ ప్రసాదం తమకు అందుబాటులోకి వచ్చిందని కొంత మంది భక్తులు చెబుతుంటే.. మరికొందరు మాత్రం టీటీడీ తీరును విమర్శిస్తున్నారు. అతి  పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అంగట్లో సరుకులా అన్ని ప్రాంతాల్లో విక్రయించడం ఏంటంటున్నారు. శ్రీవారి ప్రసాదం లడ్డూకు.. స్వీట్ షాపుల్లో ఉండే లడ్డూకు తేడా లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు భక్తులు. 

నిజానికి తిరుమల వెళ్లిన భక్తులు అతి పవిత్రంగా శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని ఇంటికి  తెచ్చుకుంటారు.  అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకున్ని సందర్శించుకోలేని తమ శ్రేయోభిలాషులు, స్నేహితులకు పవిత్రంగా  శ్రీవారి లడ్డూను పంచుతారు. వారు కూడా ప్రసాదం స్వీకరించి తిరుమల క్షేత్రాన్ని సందర్శించిన అనుభూతిని సొంతం చేసుకుంటారు. కానీ ఇప్పుడు లడ్డూ ప్రసాదం అంతటా లభిస్తుండడంతో భక్తిభావం తగ్గిపోతుందన్నది భక్తుల వాదన.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News