Telangana Inter exams : తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలను ఆపలేమన్న హైకోర్టు

Telangana Intermediate exams update :తెలంగాణలో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలు రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఇంటర్‌ బోర్డ్‌ పరీక్షలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 22, 2021, 04:41 PM IST
  • తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలు ఆపలేమన్న హైకోర్టు
  • ఈ నెల 25 నుంచి పరీక్షలు ఉన్న నేపథ్యంలో పరీక్షలను ఆపడం సమంజసం కాదన్న కోర్టు
  • ఇంటర్‌ బోర్డ్‌ పరీక్షలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసిన హైకోర్టు
Telangana Inter exams : తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలను ఆపలేమన్న హైకోర్టు

Telangana Intermediate exams update Can't interfere in inter first year examinations - Telangana HC: తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలు ఆపలేమని హైకోర్టు శుక్రవారం తేల్చి చెప్పింది. ఈ నెల 25 నుంచి పరీక్షలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పరీక్షలను ఆపడం సమంజసం కాదని హైకోర్టు పేర్కొంది. తెలంగాణలో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలు (inter first year examinations) రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఇంటర్‌ బోర్డ్‌ పరీక్షలు (Intermediate exams) నిర్వహించుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.

ఇప్పటికే ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసిందని.. పిటిషన్ దాఖలు చేయడంలో ఆలస్యమైనందంటూ హైకోర్టు పేర్కొంది. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా పిటిషన్ (pitition) వెనక్కి తీసుకోవాలని హైకోర్టు కోరింది. తెలంగాణలో ప్రస్తుతం ఇంటర్‌ సెకండియర్‌ (Inter‌ Second year) చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 25 నుంచి ఫస్టియర్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షల రద్దు (inter first year examinations cancel)చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

Also Read : Prakash raj MAA Controversy: తెరపైకి మళ్లీ 'మా' రగడ.. ఆధారాలతో ప్రకాష్ రాజ్ ట్వీట్

పేరేంట్స్ అసోసియేషన్ (Parents Association) ఆధ్వర్యంలో ఈ పిటిషన్ దాఖలైంది. ఇంటర్ ఫస్టియర్ ప్రమోటైన స్టూడెంట్స్‌కు పరీక్షలు నిర్వహించవద్దంటూ పిటిషన్‌లో కోరారు. గతంలో కరోనాతో (Corona) నెలకొన్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో ఇంటర్‌‌ ఫస్ట్ ఇయర్ విద్యార్థలందరినీ.. సెకెండ్ ఇయర్‌‌కు ప్రమోట్‌ చేశారు. ఒకసారి ప్రమోట్‌ అయిన విద్యార్థులకు (students) ఇప్పుడు పరీక్షలు నిర్వహించడం సరికాదని, ఇప్పటికే వారంతా సెకెండ్ ఇయర్ చదువుతున్నందున మళ్లీ ఫస్ట్ ఇయర్ సబ్జెక్టులు చదవడంతో గందరగోళానికి, ఒత్తిడికి గురవుతారంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. మిగతా వారిలాగే వారందరినీ పాస్‌ అయినట్టు ప్రకటించాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. 

అయితే విచారణ చేపట్టిన హైకోర్టు (High court).. ఇంటర్‌ పరీక్షలను ( Inter Exams ) రద్దు చేయలేమంటూ ఫైనల్‌గా చెప్పేసింది. చివరి నిమిషంలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. దీంతో పేరేంట్స్ అసోసియేషన్ పిటిషన్‌ను ఉపసంహరించుకుంది.

Also Read : IPL 2022 new teams: ఐపిఎల్ 2022లో రెండు కొత్త ఫ్రాంచైజీలు.. Ahmedabad, Lucknow

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News