Vijayawada Fire Accident: హీరో రామ్ కూ నోటీసులు ?

విజయవాడ కోవిడ్ సెంటర్ ( Vijayawada covid centre ) అగ్నిప్రమాద ఘటన విచారణకు అడ్డు తగిలితే నోటీసులు పంపిస్తామని హీరో రామ్ ( Hero Ram ) కు పోలీసులు హెచ్చరించారు. బాబాయ్  డాక్టర్ రమేష్ ను కాపాడేందుకు అసత్య ఆరోపణలు చేస్తే సహించమంటున్నారు.

Last Updated : Aug 16, 2020, 07:22 PM IST
Vijayawada Fire Accident: హీరో రామ్ కూ నోటీసులు ?

విజయవాడ కోవిడ్ సెంటర్ ( Vijayawada covid centre ) అగ్నిప్రమాద ఘటన విచారణకు అడ్డు తగిలితే నోటీసులు పంపిస్తామని హీరో రామ్ ( Hero Ram ) కు పోలీసులు హెచ్చరించారు. బాబాయ్  డాక్టర్ రమేష్ ను కాపాడేందుకు అసత్య ఆరోపణలు చేస్తే సహించమంటున్నారు.

విజయవాడ స్వర్ణప్యాలేస్ హోటల్ ( Vijayawada Swarna palace ) లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై ఏసీపీ సూర్యచంద్రరావు నేతృత్వంలో విచారణ జరుగుతోంది. ఈ వ్యవహారంపై డాక్టర్ రమేష్ ( Dr Ramesh ) ను వెనకేసుకుంటూ హీరో రామ్ చేసిన ట్వీట్లు వివాదాస్పదమయ్యాయి. దీనిపై ఏసీపీ తీవ్రంగానే స్పందించారు. విచారణకు ఆటంకం కలిగిస్తే హీరో రామ్ ( Hero ram ) కు నోటీసులు పంపుతామని హెచ్చరించారు. బాబాయ్ ను కాపాడుకునేందుకు అసత్య ఆరోపణలు చేస్తే సహించమన్నారు. కోవిడ్ సెంటర్ ( Covid centre ) కు క్వారెంటైన్ సెంటర్ ( Quarantine centre ) కు తేడా తెలియదా అని ప్రశ్నించారు. మరోవైపు డాక్టర్ రమేష్ పై కూడా ఏసీపీ సూర్యచంద్రరావు తీవ్రంగానే స్పందించారు. కలెక్టర్ కార్యాలయం వరకూ వచ్చి అక్కడ్నించి పరారవడంపై ఆయన మాట్లాడారు. 

విచారణకు హాజరుకాకుండా...పరారైపోయి ఫోన్ లు ఆఫ్ చేయడం మంచి పద్ధతి కాదన్నారు. పది మంది ప్రాణాలు పోతే బాధ్యతారాహిత్యంగా ప్రదర్శించడంపై ఏసీపీ మండిపడ్డారు. పరారీలో ఉండి  ఆడియో టేపులు విడుదల చేస్తూ విచారణకు సహకరిస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. విచారణకు హాజరుకావల్సిందేనని స్పష్టం చేశారు. Also read: Ram Tweet on Jagan: కుట్ర జరుగుతోందంటూ హీరో ట్వీట్ కు కారణమదేనా

Trending News