Chalo Vijayawada: ఏపీలో విద్యుత్ కార్మికులు ఆందోళనకు రెడీ అవుతున్నారు. ఇటీవల విద్యుత్ జేఏసీ నేతలతో ప్రభుత్వం చర్చలు జరపగా.. పీఆర్‌సీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే పీఆర్‌సీపై ఉద్యోగులు సంతృప్తి చెందడం లేదు. ప్రభుత్వంతో విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేతలు చీకటి ఒప్పందం చేసుకున్నారని.. పీఆర్‌సీ న్యాయబద్ధంగా లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చెప్పినట్లు 2.6 లక్షల రూపాయల గరిష్ఠ పే స్కేల్ తమకు ఆమోదం కాదని అంటున్నారు. ప్రభుత్వం ప్రతిపాదించిన పీఆర్‌సీ కాంట్రాక్ట్‌పై విద్యుత్ ఉద్యోగుల జేఏసీ, విద్యుత్ యాజమాన్యం సంతకాలు చేయనుండగా.. భారీ ఎత్తున ఆందోళనకు దిగేందుకు రెడీ అవుతున్నారు. జేఏసీ నుంచి నుంచి బయటకు వచ్చిన విద్యుత్ ఇంజినీర్లు, అసిస్టెంట్ ఇంజినీర్ల సంఘాలు.. తమకు పీఆర్‌సీ ఆమోదయోగ్యం కావని స్పష్టం చేశాయి.
ఈ నేపథ్యంలో ఈ 17న చలో విజయవాడకు విద్యుత్ ఉద్యోగుల పోరాట కమిటీ పిలుపునిచ్చింది. ఈ కార్యమానికి అనుమతిలేదని విజయవాడ సీపీ కాంతిరాణా టాటా అన్నారు. విజయవాడలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉంటుందని వెల్లడించారు. చలో విజయవాడకు హాజరయ్యే వారిపై కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఎస్మా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యుత్ సౌధ, బీఆర్‌టీఎస్ రోడ్డు ప్రాంతాల్లో ప్రత్యేక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విజయవాడ నగరంలో 3 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. విద్యుత్ సంఘం నేతలకు ఇప్పటికే నోటీసులు జారీ చేశామన్నారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
మరోవైపు మున్సిపల్ కార్మికులు కూడా ఆందోళనకు రెడీ అవుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ.. ఈ నెల 24న చలో విజయవాడకు పిలుపునిచ్చారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఓ వాల్‌పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఆగస్టు 1న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడించామని.. ప్రభుత్వం దిగివచ్చి చర్చలు జరిపిందని తెలిపారు. అయితే చాలా డిమాండ్లకు పరిష్కారం లభించలేదని అన్నారు. ఈ నెల 24న ఆందోళనకు దిగుతున్నామని చెప్పారు.
Also Read: Independence Day Celebrations: అన్ని సేవలు ఇంటి వద్దకే.. గ్రామ స్వరాజ్యం తీసుకువచ్చాం: సీఎం జగన్
Also Read: Wanindu Hasaranga: స్టార్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగా సంచలన నిర్ణయం.. టెస్ట్ క్రికెట్‌కు గుడ్ బై..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook