Chandrababu Vizag Tour: బ్రేకింగ్: చంద్రబాబును అడ్డుకున్న పోలీసులు.. విశాఖలో ఉద్రిక్తత

Chandrababu Vizag Tour: తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు,  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నం పర్యటన ఉద్రిక్తంగా మారింది. రుషికొండ వెళ్లేందుకు చంద్రబాబుకు అనుమతి నిరాకరించారు. కొంత కాలం క్రితం రిషికొండని హరిత రిసార్ట్స్ ను జగన్ సర్కార్ కూల్చివేసింది.

Last Updated : May 5, 2022, 05:25 PM IST

    విశాఖలో చంద్రబాబును అడ్డుకున్న పోలీసులు

    రిషికొండ పర్యటనకు అనుమతి లేదని బ్రేక్

    పోలీసులతో టీడీపీ నేతల వాగ్వాదం

 Chandrababu Vizag Tour: బ్రేకింగ్: చంద్రబాబును అడ్డుకున్న పోలీసులు.. విశాఖలో ఉద్రిక్తత

Chandrababu Vizag Tour: తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు,  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నం పర్యటన ఉద్రిక్తంగా మారింది. రుషికొండ వెళ్లేందుకు చంద్రబాబుకు అనుమతి నిరాకరించారు. కొంత కాలం క్రితం రిషికొండని హరిత రిసార్ట్స్ ను జగన్ సర్కార్ కూల్చివేసింది. ఆదునీకరణ పేరుతో పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారంటూ రిషికొండ పర్యటనకు సిద్ధమయ్యారు చంద్రబాబు. అయితే అనుమతి లేదంటూ ఆయనను అడ్డుకున్నారు.

హరిత రిసార్ట్స్ పరిశీలనకు వెళ్లిన చంద్రబాబును.. ఎండాడ జంక్షన్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. జాతీయ రహదారిపై చంద్రబాబును కాన్వాయ్ ను నిలిపివేసి టీడీపీ నేతలను నిలువరించారు. ఈ సందర్భంగా పోలీసులతో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత తలెత్తింది. తర్వాత టీడీపీ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు.. చంద్రబాబును తాళ్లవలస పంపించారు.

అంతకుముందు విశాఖలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు చంద్రబాబు. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై కేడర్ కు దిశానిర్దేశం చేశారు. జగన్ పాలనా వైఫల్యాలపై జనంలోకి వెళ్లాలని సూచించారు. 2029 నాటికి దేశంలో నెంబర్ వన్ గా ఉండాలని తాను ప్రణాళికలు రచిస్తే.. జగన్ రెడ్డి నాశనం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. ప్రస్తుతం ఏపీ అవినీతి, అరాచకాలకు అడ్డాగా మారిందన్నారు. డ్రగ్స్ కు ఏపీని కేరాఫ్ అడ్రస్ గా మార్చివేశారని చంద్రబాబు అన్నారు. ఇబ్బడిముబ్బడిగా అప్పులు తెస్తూ రాష్ట్ర భవిష్యత్ ను ప్రమాదంలో పడేశారని విమర్శించారు. జగన్ సర్కార్ చేస్తున్న అప్పులన్ని మనమే కట్టాల్సి ఉంటుందని చంద్రబాబు కామెంట్ చేశారు. పన్నుల మీద పన్నులు వేస్తూ జగన్ రెడ్డి.. జనాలపై మోయలేని భారం మోపుతున్నారని టీడీపీ అధినేత మండిపడ్డారు.

READ ALSO: Ap Ssc Exam Papers Leak: ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ప్రశ్నాపత్రాల లీక్.. టీడీపీపై సీఎం జగన్ సంచలన ఆరోపణలు

Terrorists Plot For Bomb Blasts: దేశంలో భారీ పేలుళ్లకు ఉగ్రవాదుల కుట్ర.. తెలంగాణకు ఆయుధాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News