మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్యకు కారణాలు ఇవేనా ..?

ఏపీ మాజీ స్పీకర్  కోడెల శివప్రసాద్ ఆత్మహత్య అంశం రాజకీయంగా చర్చ నీయంశంగా మారింది.

Last Updated : Sep 17, 2019, 04:58 PM IST
మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్యకు కారణాలు ఇవేనా ..?

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్యకు కారణాలు ఏమై ఉండది...? కోడెల మరణం తర్వాత ఇప్పుడు సగటు వ్యక్తికి అంతుచిక్కని  ప్రశ్న ఇదే.. ఇదే అంశంపై నిన్నటి నుంచీ టీడీపీ, వైసీపీ నేతల మధ్య పరస్పర ఆరోపణల పర్వం కొనసాగుతోంది. కేసుల పేరుతో జగన్ సర్కార్ వేధింపులే కోడెల సూసైడ్ కు కారణమని టీడీపీ ఆరోపిస్తుండగా... కోడెల విషయంలో టీడీపీ అధినేత వైఖరే కారణమంటూ వైసీపీ ఎదురుదాడి చేస్తోంది.

టీడీపీ వాదన ఇదే... !!

కోడెల మరణంపై చంద్రబాబు స్పందిస్తూ వైసీపీ ప్రభుత్వం వచ్చాక టీడీపీ శ్రేణులను హింసిచడం మొదలు పెట్టింది. ఈ క్రమంలో సీనియన్ నేత కోడెలపై ఎన్నో కేసులు పెట్టింది. ఆయన అవమానించింది...ఆయన ప్రతిష్ఠకు భంగం వాటిల్లే చర్యలకు పూనుకుంది. ఈ పరిణామలే కోడెల ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. ఒక్కమాటలో చెప్పాలంటే వైసీపీ ప్రభుత్వ వేధింపుల వల్లే కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఇదే తరహా స్వరం టీడీపీ ముఖ్య నేతలు వినిపిస్తున్నారు

వైసీపీ వాదన ఇదే !!
దశాబ్దాల పాటు టీడీపీ జెండా మొస్తూ మొదటి నుంచి చంద్రబాబుకు గట్టి మద్దతు దారుడిగా నిలిచిన సీనియర్ నేత కోడెలను క్రమ క్రమంగా ప్రాధాన్యత తగ్గించడం వల్లే ఈ రోజు ఇలాంటి పరిస్థితి వచ్చేందని వైసీపీ వాదిస్తోంది. ఇది చాలన్నదన్నట్లు అధికారం కోల్పోయిన తర్వాత కేసులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న కోడెలకు.. కష్టకాలంలో సొంత పార్టీ నుంచి నైతిక మద్దతు లేకపోవడం వల్ల ఆయన మనోధైర్యం కోల్పోయారని... ఇబ్బందుల్లో ఉన్న కోడెలకు చంద్రబాబు పట్టించుకోలేదని విమర్శించారు. ఇలా  చంద్రబాబు తీరు కోడెలకు మనస్థాపానికి గురించేసిందన్నారు.   

తీవ్ర మనస్థాపానికి గురైన కోడెల !!
వాస్తవానికి అసెంబ్లీ ఫర్నిచర్ వ్యవహారంలో మాత్రమే ఆయనపై నేరుగా కేసు నమోదైంది. మిగతా కేసుల్లో ఆయన కుమారుడు, కుమార్తె సత్తెనపల్లిలో జనాన్ని వేధించడం, వసూళ్లకు పాల్పడటం లాంటి ఆరోపణలపై  కేసులు నమోదయ్యాయి.  దీనిపై స్పందించిన కోడెల  తాను చట్టపరంగా ఎదుర్కొంటానని ప్రకటించడంతో పాటు హైకోర్టులో ముందస్తు బెయిల్ కూడా తెచ్చుకున్నారు. అయితే ఈ పరిణామాలు కోడెలను చిక్కుల్లో పడేయడంతో పాటు ఆయన పరువుకు భంగం కలిగాయనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో కష్టకాలంలో సొంత పార్టీ నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించకపోవడం వంటి కారణాల వల్ల కోడెల మనస్థానికి గురయ్యారని వాదన కూడా బలంగా వినిపిస్తోంది. 

ఏది ఏమైనప్పటికీ కోడెల శివప్రసాద రావు ఆత్మహత్య ఉదంతం తెలుగు రాష్ఠ్రాల్లో తీవ్ర చర్చనీయంశమైంది. అయితే కోడెల ఆత్మహత్యకు దారితీసిన పరీస్ధితులు మాత్రం రాజకీయాల్లో కొనసాగాలనుకునే సగటు నేతలకు మాత్రం ఎన్నో పాఠాలు నేర్పేలా ఉంది కదూ. 

Trending News