జగన్ ప్రమాణస్వీకారోత్సవానికి ఏర్పాట్లు

జగన్ ప్రమాణస్వీకారోత్సవానికి ఏర్పాట్లు

Updated: May 25, 2019, 02:55 PM IST
జగన్ ప్రమాణస్వీకారోత్సవానికి ఏర్పాట్లు
File pic

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రిగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ చేయనున్న ప్రమాణస్వీకారం ఉత్సవాల ఏర్పాట్లపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన సచివాలయంలో నేడు ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. డీజీపీ ఆర్పీ ఠాకూర్, విజయవాడ సీపీ, సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌, మునిసిపల్ శాఖ ప్రత్యేక కార్యదర్శి కరికాల వలవన్, ప్రొటోకల్ డైరెక్టర్ అశోక్‌బాబు, విజయవాడ మునిసిపల్ కమిషనర్‌ రామారావు ఈ సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. 

జగన్ ప్రమాణస్వీకారోత్సవానికి భారీ సంఖ్యలో ప్రముఖులు, పార్టీ కార్యకర్తలు, మద్దతుదారుల రాకకు వీలుగా ఉండే విధంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే విశాలమైన ప్రదేశాన్ని ఎంపిక చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రమాణస్వీకారోత్సవానికి భారీ సంఖ్యలో హాజరయ్యే వారి వాహనాల పార్కింగ్ సదుపాయాన్ని సైతం దృష్టిలో పెట్టుకుని స్థలాన్ని ఎంపిక చేయనున్నారు.