Visakha steel plant: విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం తీవ్రమౌతోంది. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రారంభమైన నిరసనలు ఢిల్లీకు చేరాయి. వైసీపీ ఎంపీలు మద్దతు ప్రకటించారు.
ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు నినాదంతో ప్రారంభమైన వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం(Vizag steel plant privatisation) చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమం కొనసాగుతోంది. స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులు చేపట్టిన ఈ ఉద్యమం తీవ్రమవుతోంది.విశాఖలో ప్రారంభమైన ఉద్యమం దేశ రాజధాని ఢిల్లీకు చేరింది.ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద స్టీల్‌ప్లాంట్ కార్మికులు పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. కార్మికుల ధర్నాకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పాల్గొన్నారు. ఉదయం నుంచి ఢిల్లీలో వర్షం కురుస్తున్నా..ధర్నా మాత్రం కొనసాగుతోంది. భారీ వర్షాన్ని లెక్కచేయకుండా ఇటు కార్మికులు అటు వైసీపీ ఎంపీలు ధర్నాను కొనసాగించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదించారు. విశాఖ ఉక్కు కోసం ఎందరో ప్రాణత్యాగం చేశారని..విశాఖ స్టీల్‌ప్లాంట్ వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పించిందని వైసీపీ ఎంపీలు తెలిపారు.
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని వైసీపీ ఎంపీలు డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు గనులు కేటాయించి..ప్రైవేటీకరణ నిర్ణయాన్ని రద్దు చేసుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్(Ap cm ys jagan) ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని(Central government)కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ(Narendra modi)కు లేఖ రాశారు. పార్లమెంట్ సమావేశాల్లో సైతం ఇదే అంశంపై సభను అడ్డుకున్నారు.
Also read: కృష్ణా జలాల వివాదంపై ఛీప్ జస్టిస్ ఎన్ వి రమణ కీలక వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook