YSR LifeTime Achievement Awards 2021 announced: వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చి, ఉత్తమ సేవలందించిన వారికి వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు (YSR LifeTime Achievement Awards) ఇవ్వనున్నారు. సోమవారం జరిగే ఈ కార్యక్రమంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్ పాల్గొంటారు. వారి చేతుల మీదుగా అవార్డులు ప్రదానం ఉంటుంది. రేపు ఉదయం 11 గంటలకు విజయవాడ ఏ-కన్వెన్షన్ సెంటర్‌లో అవార్డుల (Awards) ప్రదానోత్సవం జరుగుతుంది.
Also Read : India Vs New Zealand: భారత్ స్కోర్ - 110/7.. న్యూజిలాండ్ టార్గెట్ 111
2021 సంవత్సరానికి 59 అవార్డులు (Awards) ఇవ్వనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. 29 వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్, 30 వైఎస్సార్ అచీవ్‌మెంట్ అవార్డులు (YSR LifeTime Achievement Awards) ప్రదానం చేయనున్నారు. 9 సంస్థలకు, వ్యవసాయం, అనుబంధ రంగాలకు సంబంధించి 11 అవార్డులు ఇవ్వనున్నారు.
కళలు, సంస్కృతికి 20 అవార్డులు, సాహిత్యం-7, జర్నలిజం-6, కొవిడ్ సమయంలో సేవలందించిన ప్రభుత్వ వైద్య సిబ్బందికి-6 అవార్డులు ఇవ్వనున్నారు. నగదు పురస్కారంతో పాటు మెమొంటో, మెడల్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందజేయనుంది. తొలిసారిగా వైఎస్సార్ (YSR) లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు, వైఎస్సార్ అచీవ్‌మెంట్ అవార్డులు ఇస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది.
Also Read : COVID-19: ఆ దేశాల్లో కోవిడ్ కొత్త స్ట్రెయిన్ కల్లోలం, మనదేశంలో కాస్త తక్కువే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి