Amazon Offers: ఆన్‌లైన్ షాపింగ్ ప్రియులకు గుడ్‌న్యూస్. భారీ ఆఫర్లతో అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ మరోసారి వచ్చేసింది. మరి కొద్దిగంటల్లో అంటే జనవరి 13 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుంది. వివిధ రకాల ఉత్పత్తులపై ఏకంగా 75 శాతం వరకూ బంపర్ డిస్కౌంట్ అందుబాటులో కలదు. ఆ వివరాలు తెలుసుకుందాం.
కొత్త ఏడాది 2025లో మొట్టమొదటి సేల్ ప్రకటించింది అమెజాన్. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2025 జనవరి 13 అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానుంది. ఆన్‌లైన్ షాపింగ్ ప్రియులకు ఇది మంచి అవకాశం. కొత్త ఏడాదిలో నచ్చిన ఉత్పత్తులు అతి తక్కువ ధరకే పొందవచ్చు. ప్రతి ఏటా వచ్చినట్టే ఈసారి కూడా గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ వచ్చేసింది. వివధ రకాల స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్స్, పీసీలతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. వీటితో పాటు హోమ్, కిచెన్ అప్లయెన్సెస్, టీవీలపై కూడా భారీ డిస్కౌంట్ లభించనుంది. జనవరి 26కు ముందే సంక్రాంతికే ఈ బంపర్ సేల్ అందుబాటులో వస్తోంది.
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2025 జనవరి 13 మద్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. అయితే ప్రైమ్ సభ్యులకు మాత్రం 12 గంటలు ముందు నుంచే అందుబాటులో ఉంటుంది. అంటే రాత్రి 12 గంటలకే ఈ సేల్ పొందవచ్చు. అమెజాన్ యాప్‌లో దీనికి సంబంధించి పూర్తి వివరాలున్నాయి. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుపై, ఈఎంఐ లావాదేవీలపై అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభించనుంది.
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే ఆఫర్లు
హోమ్, కిచెన్, అవుట్ డోర్ ఉత్పత్తులపై 50 శాతం వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. అమెజాన్ ఉత్పత్తులపై 75 శాతం వరకూ తగ్గింపు ఉంటుంది. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్స్, ట్యాబ్స్ , టీవీలు, ఇయర్ బడ్స్‌పై 75 శాతం వరకూ తగ్గింపు అందుతుంది. ఇక టీవీలు ప్రోజెక్టర్లపై అయితే 65 శాతం వరకూ డిస్కౌంట్ లభించనుంది. అలెక్సా, అమెజాన్ ఫైర్ స్టిక్‌పై 35 శాతం, మొబైల్ ఫోన్లు, పరికరాలపై 40 శాతం వరకూ డిస్కౌంట్ లబించవచ్చు. వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలపై 65 శాతం వరకూ డిస్కౌంట్ లభించనుంది.
Also read: Fastag Check: సంక్రాంతికి ఊరెళ్తున్నారా, ఫాస్టాగ్ ఓసారి చెక్ చేసుకోండి లేకపోతే ఇబ్బందులే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.