Amazon Offers: Samsung Galaxy S23 సిరీస్ ఫోన్లపై భారీ తగ్గింపు ఆఫర్లు, అమెజాన్‌లో మాత్రమే

Amazon Offers: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 సిరీస్ ఫోన్లపై ఏకంగా 40 శాతం వరకూ తగ్గింపు ఆఫర్ ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 28, 2024, 10:50 AM IST
Amazon Offers: Samsung Galaxy S23 సిరీస్ ఫోన్లపై భారీ తగ్గింపు ఆఫర్లు, అమెజాన్‌లో మాత్రమే

Amazon Offers: ప్రముఖ ఈ కామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో రిపబ్లిక్ డే సేల్ ఆఫర్ నడుస్తోంది. ఈ సందర్భంగా దాదాపు అన్ని బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లపై ప్రత్యేక తగ్గింపు ఆఫర్లు ఉన్నాయి. ముఖ్యంగా శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 సిరీస్ ఫోన్లపై నమ్మశక్యం లేని ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

శాంసంగ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌గా పరిగణించే శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23, శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 ఎఫ్ఈ, శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా మోడల్ ఫోన్లు కొనే ఆలోచన ఉంటే ఇదే మంచి అవకాశం. అమెజాన్ ఈ కామర్స్ వేదికలో అద్భుతమైనం డిస్కౌంట్ ఆఫర్ ఉంది. ఈ ఫోన్లపై ఏకంగా 36 శాతం డిస్కౌంట్ నడుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్లలో ప్రోసెసర్, కెమేరా , డిస్‌ప్లే అన్నీ అద్భుతంగా ఉంటాయి.

Samsung Galaxy S23 FE 5G ఫీచర్లు

ఈ ఫోన్‌లో 60 హెర్ట్జ్ నుంచి 120 హెర్ట్జ్ వరకూ అడ్జస్టబుల్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డైనమిక్ ఎమోల్డ్ డిస్‌ప్లే ఉంటుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ వైడ్ కెమేరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమేరా, 8 మెగాపిక్సెల్ టెలీఫోటో కెమేరాతో ట్రిపుల్ కెమేరా సెటప్ ఉంది. సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం 10 మెగాపిక్సెల్ కెమేరా ఉంటుంది. ప్రైమరీ కెమేరాలో 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ ఉంటుంది. వీడియో డిజిటల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్లు మరో ప్రత్యేకత. ఇందులో 8 జీబీ ర్యామ్- 128జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్లు ఉన్నాయి. 4500 ఎంఏహెచ్ బ్యాటరీ మరో ప్రత్యేకత. ఈ ఫోన్ అసలు ధర 79,999 రూపాయలు కాగా అమెజాన్‌లో 36 శాతం డిస్కౌంట్ అనంతరం 50,995 రూపాయలకే లభిస్తోంది. 

Samsung Galaxy S23 ఫీచర్లు

గ్లాస్ మెటల్ డిజైన్‌తో అత్యంత ఆకర్షణీయమైన లుక్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6.1 అంగుళాల ఎమోల్డ్ డిస్‌ప్లేతో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8వ జనరేషన్ 2 సీపీయూతో అనుసంధానితమై ఉంటుంది. ఇందులో కూడా 50 మెగాపిక్సెల్, 12 మెగాపిక్సెల్, 10 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమేరా సెటప్ ఉంది. ఈ ఫోన్ బ్యాటరీ సామర్ధ్యం కాస్త తక్కువే. 3,900 ఎంఏహెచ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ అసలు ధర 89, 999 రూపాయలు కాగా 28 శాతం డిస్కౌంట్ అనంతరం 64,999 రూపాయలకు లభిస్తోంది. 

Samsung Galaxy S23 Ultra ఫీచర్లు

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రాలో శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ ప్రోసెసర్ ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో ప్రైమరీ కెమేరా అత్యధికంగా 200 మెగాపిక్సెల్ ఉండటం విశేషం. ఇది కాకుండా 10 మెగాపిక్సెల్ రెండు టెలీఫోటో కెమేరాలున్నాయి. 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేస్ కెమేరా ఉన్నాయి. ఈ ఫోన్ అసలు ధర 1,49,999 రూపాయలు కాగా 30 శాతం డిస్కౌంట్ అనంతరం అమెజాన్‌లో 1,94,999 రూపాయలకు లభిస్తోంది. 

Also read: Ration Card e-Kyc: రేషన్ కార్డుల ఇ కేవైసీ గడువు పెంపు, ఎలా చేస్తారంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News