Investment Tips: ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి.. తక్కువ కాలంలోనే భారీ ఆదాయం

Best Investment Options: ప్రస్తుతం ఇన్వెస్ట్‌మెంట్‌కు ప్లాన్ చేస్తున్నవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రతి నెలా కొంత డబ్బును పెట్టుబడి పెడుతూ.. మంచి లాభాల కోసం వెతుకుతున్నారు. అలాంటి వారి కోసం ఈ టిప్స్..  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 16, 2023, 10:50 PM IST
Investment Tips: ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి.. తక్కువ కాలంలోనే భారీ ఆదాయం

Best Investment Options: మనం డబ్బు సంపాదిస్తే.. డబ్బే డబ్బును సంపాదిస్తుంది. అవును ఇది నిజం. కానీ మనం సరైన పద్ధతిలో మన డబ్బును ఇన్వెస్ట్ చేయడం కూడా చాలా ముఖ్యం. ప్రస్తుతం మార్కెట్‌లో పెట్టుబడి పెట్టేందుకు అనేక ఆప్షన్లు ఉన్నాయి. కానీ వాటిలో మన డబ్బు సురక్షితంగా ఉండడంతోపాటు ఎక్కువ లాభాలు వచ్చే విధంగా ఉండాలి. కేవలం ఒక సంవత్సరం మెచ్చురిటీపై అధిక లాభాలు ఇచ్చే స్కీమ్స్‌ గురించి తెలుసుకుందాం..
 
ఆర్‌డీ విషయానికి వస్తే.. ఇది ఒక రకమైన పిగ్గీ బ్యాంకుగా చెప్పొచ్చు. ఇందులో ప్రతి నెలా కొంచెం డబ్బు పెట్టాలి. మెచ్యూరిటీపై మీరు వడ్డీతో పాటు మొత్తం మొత్తాన్ని పొందుతారు. ఒక ఏడాదికి లేదా రెండేళ్లకు లేదా ఏ కాలానికైనా ఆర్‌డీ చేయవచ్చు. ఇందులో మీకు బ్యాంకు లేదా పోస్టాఫీసు నుంచి వడ్డీ లభిస్తుంది. అన్ని బ్యాంకుల్లో ఆర్‌డీ సౌకర్యం ఉంది. లేదనుకుంటే పోస్టాఫీసుకు వెళ్లి కూడా ఆర్‌డీ చేసుకోవచ్చు. 

లిక్విడ్ ఫండ్స్ స్వల్పకాలిక పెట్టుబడికి మరో మంచి ఆప్షన్. లిక్విడ్ ఫండ్స్‌కు ఎలాంటి లాక్ ఇన్ పీరియడ్ లేకుండా ఇన్వెస్ట్ చేయవచ్చు. అంతేకాకుండా ఇందులో ఎగ్జిట్ లోడ్ కూడా లేదు. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు తీసుకోవచ్చు. బ్యాంక్ ఎఫ్‌డీలో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం చాలా మందికి కూడా ఇష్టమైన ఆప్షన్ ఇది. మీరు 7 రోజుల నుంచి పదేళ్ల వరకు చేయవచ్చు. ఇందులో వడ్డీ రేటు కాలాన్ని బట్టి మారుతుంది. 

ఎఫ్‌డీ కంటే ఎక్కువ ఆదాయం కావాలనుకుంటే.. డెట్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. డెట్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం తక్కువ రిస్క్ ఉంటుంది. అయితే మార్కెట్ హెచ్చుతగ్గులపై ఆధారపడి ఉంటుంది. డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి ఎఫ్‌డీ కంటే ఎక్కువ రాబడిని ఇస్తుంది. డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ సెక్యూరిటీలలో డబ్బును ఇన్వెస్ట్ చేస్తాయి. వీటిలో బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు, ట్రెజరీ బిల్లులు, నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లు మొదలైనవి ఉన్నాయి. 

కార్పొరేట్ ఎఫ్‌డీ విషయానికి వస్తే.. ఇందులో కంపెనీలు తమ వ్యాపారం కోసం మార్కెట్ నుంచి డబ్బును సేకరిస్తాయి. ఇందుకోసంం వారు ఎఫ్‌డీని జారీ చేస్తారు. ఇది సాధారణ ఎఫ్‌డీలాగా పనిచేస్తుంది. మీరు ఆన్‌లైన్‌లో కూడా తీసుకోవచ్చు. అయితే కార్పొరేట్ ఎఫ్‌డీ సాధారణ ఎఫ్‌డీ కంటే ఎక్కువ వడ్డీ రేట్లను అందిస్తుంది. ఈ ఎఫ్‌డీ మెచ్యూరిటీ వ్యవధి ఒక ఏడాది నుంచి ఐదేళ్ల వరకు ఉంటుంది. మీ సౌలభ్యాన్ని బట్టి.. మీరు ఏదైనా కాలాన్ని ఎంచుకోవచ్చు.

ఇది కూడా చదవండి : Rain Alert: ఏపీ, తెలంగాణకు వర్ష సూచన, ఎండలు-ఉక్కపోత నుంచి ఉపశమనం

ఇది కూడా చదవండి : Israel Hamas War: హమాస్ ఉగ్రవాదులను ఏరివేతకు ఇజ్రాయెల్ సైన్యం విశ్వప్రయత్నాలు..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

Trending News