CBDT New Order: ఇన్‌కంటాక్స్ కీలక మార్పులు ఇక నుంచి టేక్ హోమ్ శాలరీలో పెరుగుదల

CBDT New Order: ట్యాక్స్ పేయర్లు ఇన్‌కంటాక్స్ శాఖ నుంచి ఎప్పటికప్పుుడు వెలువడే అప్‌డేట్స్ పరిశీలిస్తుండాలి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఇప్పుడు కీలక మార్పు చేసింది. ఆ కొత్త మార్పు ఏంటనేది తెలుసుకుందాం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 30, 2023, 04:12 PM IST
CBDT New Order: ఇన్‌కంటాక్స్ కీలక మార్పులు ఇక నుంచి టేక్ హోమ్ శాలరీలో పెరుగుదల

CBDT New Order: దేశవ్యాప్తంగా లక్షలాదిమంది వేతన ట్యాక్స్ పేయర్లకు ఇన్‌కంటాక్స్ శాఖ భారీగా ఉపశమనం ఇచ్చింది. ట్యాక్స్ నిబంధనల్లో కొన్ని మార్పులు చేసింది. త్వరలో ఈ మార్పులు చేర్పులు అమల్లో రానున్నాయి. ఫలితంగా చేతికందే ఇన్‌హ్యాండ్ జీతం గణనీయంగా పెరగనుంది. 

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఇటీవలే ఓ నోటిఫికేషన్ వెలువరించింది. ఉద్యోగులకు కంపెనీ లేదా యాజమాన్యం అందించే రెంట్ ఫ్రీ హోమ్స్‌కు సంబంధించిన నోటిఫికేషన్ ఇది. వచ్చే నెల నుంచి కొన్ని కీలకమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఆ వివరాలు మీ కోసం..

ఉద్యోగులకు లేదా సిబ్బందికి కంపెనీలు రెంట్ ఫ్రీ వసతి కల్పిస్తుంటాయి. అంటే క్వార్టర్స్ అని చెప్పవచ్చు. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఇలా క్వార్టర్స్ వసతి పొందిన ఉద్యోగులు ఇక నుంచి గతం కంటే ఎక్కువ సేవ్ చేసుకోవచ్చు. అదే సమయంలో ఇన్‌టేక్ శాలరీ కూడా గణనీయంగా పెరగనుంది. అంటే వచ్చే నెల నుంచి ఉద్యోగుల టేక్ హోమ్ శాలరీలో మార్పులు వస్తున్నాయి. ఈ కొత్త మార్పులు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

ఈ నోటిఫికేషన్ ప్రకారం కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వేతర ఉద్యోగులు పొందిన అన్‌ఫర్నిష్డ్ వసతి విలువ మారనుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 40 లక్షల కంటే ఎక్కువ జనాభా కలిగి నగరాల్లో 10 శాతం జీతం లెక్కిస్తారు. గతంలో ఇది  25 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉంటే 15 శాతం జీతం ఉండేది. ఇక 40 లక్షల కంటే తక్కువ జనాభా కలిగిన ప్రాంతాల్లో 7.5 శాతం జీతం పరిగణిస్తారు. గతంలో 10-25 లక్షల జనాభా నగరాల్లో 10 శాతముండేది.

ఈ కొత్త మార్పుల ప్రభావం కంపెనీ ఇచ్చిన రెంట్ ఫ్రీ వసతిలో ఉండేవారికి వర్తిస్తుంది. ఇప్పుుడు కొత్త ఫార్ములా ప్రకారం రెంట్ లెక్కింపు ఉంటుంది. మారిన ఫార్ములాలో రేట్ ఆఫ్ వాల్యుయేషన్ తగ్గిపోయింది. అంటే జీతం నుంచి డిడక్షన్ తగ్గడంతో చేతికి అందే జీతం ఎక్కువగా ఉంటుంది.

Also read: BSNL New Recharge Plan: బీఎస్ఎన్ఎల్ నుంచి కొత్తగా అత్యంత చౌకైన లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News