POCO F4 5G: పోకో ఎఫ్4 5జీ.. ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ.35 వేలు.. కానీ ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.9999కే

POCO F4 5G Smart Phone: మీరు తక్కువ ధరలో బెస్ట్ బ్రాండ్ మొబైల్ కోసం చూస్తున్నట్లయితే.. ఫ్లిప్‌కార్ట్‌లో బెస్ట్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. 

Written by - Srinivas Mittapalli | Last Updated : Jul 26, 2022, 04:00 PM IST
  • ఫ్లిప్‌కార్ట్ లేటెస్ట్ ఆఫర్స్
  • స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపు అందిస్తున్న ఫ్లిప్‌కార్ట్
  • పోకో ఎఫ్4 5జీ స్మార్ట్ ఫోన్ సగం కన్నా తక్కువ ధరకే
POCO F4 5G: పోకో ఎఫ్4 5జీ.. ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ.35 వేలు.. కానీ ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.9999కే

POCO F4 5G Smart Phone: ప్రముఖ ఈకామర్స్ సైట్‌ ఫ్లిప్‌కార్ట్‌ పలు బ్రాండ్స్‌కి చెందిన స్మార్ట్ ఫోన్లపై బిగ్ డిస్కౌంట్ అందిస్తోంది. ప్రస్తుతం పోకో ఎఫ్ 4 5జీ (నైట్ బ్లాక్,8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ) స్మార్ట్ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్‌పై ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఎక్స్‌చేంజ్ ఆఫర్ ద్వారా అతి చౌక ధరకే ఈ స్మార్ట్ ఫోన్‌ని సొంతం చేసుకోవచ్చు.

ఫ్లిప్‌కార్ట్‌లో 14 శాతం డిస్కౌంట్ :

 పోకో ఎఫ్4 5జీ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ.34,999. కానీ ఫ్లిప్‌కార్ట్‌లో 14 శాతం డిస్కౌంట్‌తో రూ.29,999కే ఈ స్మార్ట్‌ ఫోన్ అందుబాటులో ఉంది. అంటే.. ఈ ఆఫర్ ద్వారా రూ.5 వేలు వరకు ఆదా అవుతుంది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలుకు హెచ్‌డీఎఫ్‌సీ కార్డు వాడినట్లయితే మరో రూ.2 వేలు వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అప్పుడు మరింత చౌకగా రూ.27,999కే ఈ ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు.

ఎక్స్‌చేంజ్ ఆఫర్‌తో రూ.9999కే :

పోకో ఎఫ్4 5జీ స్మార్ట్ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. మీ స్మార్ట్ ఫోన్‌ని ఎక్స్‌చేంజ్ చేసుకోవడం ద్వారా దాని కండిషన్‌ని బట్టి రూ.20 వేల వరకు తగ్గింపు పొందుతారు. ఒకవేళ పూర్తి ఆఫర్ వర్తించినట్లయితే రూ.29,999కి అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ ఫోన్‌ని కేవలం రూ.9999కే మీ సొంతం చేసుకోవచ్చు. అయితే ఎక్స్‌చేంజ్ ఆఫర్‌కి షరతులు వర్తిస్తాయని కస్టమర్స్ గుర్తుంచుకోవాలి.
 

Also Read: KTR: కాలుకు గాయమైందని కేటీఆర్ డ్రామా చేస్తున్నారా? అసలు కారణం ఇదేనా?  

Also Read: Macharla Niyojakavargam: నితిన్ 'ధమ్కీ' అదిరింది.. 'మాచర్ల నియోజకవర్గం' ట్రైలర్ ప్రోమో వచ్చేసింది..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News