Elon Musk Restricts Reading Limits: ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఎక్కువ మంది వైరిఫై అకౌంట్లు తీసుకునేలా సరికొత్త ప్లాన్ వేశాడు. పోస్టులను చూసేందుకు కూడా లిమిట్ సెట్ చేశాడు. ఇక నుంచి వెరిఫై అకౌంట్ ఉన్న యూజర్లు రోజుకు ఆరు వేల పోస్టులు వరకు చూడగలరు. అన్‌వెరిఫైడ్ యూజర్లకు రోజుకు 600 పోస్టులు చూసేందుకు అవకాశం ఇవ్వగా.. కొత్తగా అకౌంట్లు తెరిచిన యూజర్లు రోజుకు 300 పోస్టులు మాత్రమే చూడవచ్చని తెలిపారు. ఈ మేరకు ఎలన్ మస్క్ ట్వీట్ చేశారు. అనంతరం మరో ట్వీట్ చేస్తూ.. త్వరలోనే వెరిఫైడ్ యూజర్లకు 8 వేలు, అన్‌వెరిఫైడ్ యూజర్లకు 800, కొత్త యూజర్లకు 400కి పోస్టుల చూసే లిమిట్ పెంచుతామని వెల్లడించారు.
Rate limits increasing soon to 8000 for verified, 800 for unverified & 400 for new unverified https://t.co/fuRcJLifTn
— Elon Musk (@elonmusk) July 1, 2023
అయితే తాజాగా మరో అప్‌డేట్ ఇస్తూ.. ఇప్పటి నుంచి వెరిఫైడ్ అకౌంట్లకు 10 వేల పోస్టులు, అన్‌వెరిఫైడ్ యూజర్లకు 1000, కొత్త వినియోగదారులకు 500 పోస్టులకు లిమిట్ పెంచినట్లు ఎలన్ మస్క్ ట్వీట్ చేశారు. వెంటవెంటనే మస్క్ తన నిర్ణయాలు మార్చుకోవడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. విపరీతమైన డేటా స్క్రాపింగ్, సిస్టమ్ మానిప్యులేషన్‌ను పరిష్కరించడానికి తాత్కాలికంగా లిమిట్ సెట్ చేస్తున్నామని మస్క్ వెల్లడించాడు. పోస్టులను చూసే సంఖ్య లిమిట్‌కు దగ్గరలో ఉన్నప్పుడు అలర్ట్ వంటి మెసెజ్ వస్తుంది.
Now to 10k, 1k & 0.5k
— Elon Musk (@elonmusk) July 1, 2023
అంతకుముందు శనివారం సాయంత్రం నుంచి ట్విట్టర్ ఓపెన్ అవ్వగా యూజర్ల ఇబ్బంది పడ్డారు. అయితే ఆ తరువాత అసలు విషయం తెలుసుకుని షాక్ అయ్యారు. రోజులో చూసే లిమిట్ అయిపోవడంతో ట్విట్టర్ ఓపెన్ అవ్వలేదని ఎలన్ మస్క్ ట్వీట్ తరువాత అర్థమైంది. అంతకుముందే ఎలన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. శుక్రవారం నుంచి వినియోగదారులు ట్విట్టర్ ఓపెన్ చేయాలంటే కచ్చితంగా లాగిన్ కావాల్సిందేనని స్పష్టం చేశారు.
ట్విట్టర్ నుంచి డేటా చోరీకి గురవుతుందని.. సాధారణ వినియోగదారుల పోస్టులను దుర్వినియోగం చేస్తున్నారని చెప్పారు. చాట్‌జిపిటి, ఓపెన్‌ఏఐ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థలు తమ భాషా నమూనాలకు శిక్షణ ఇచ్చేందుకు ట్విట్టర్ డేటాను ఉపయోగిస్తున్నాయని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా.. ట్విట్టర్ ఆదాయాన్ని పెంచేందుకు బ్లూటిక్ కోసం సబ్‌స్క్రిప్షన్ పాలసీని తీసుకువచ్చిన విషయం తెలిసిందే.
Also Read: TS Politics: బీఆర్ఎస్‌కు భారీ షాక్.. జడ్పీ ఛైర్మన్, 56 మంది సర్పంచ్‌లు, 26 మంది ఎంపీటీసీలు గుడ్‌బై
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి