Second Hand Car: సెకండ్ హ్యాండ్ కారు కొన్నారా ? ఈ ఐదూ ఎప్పుడూ మీతో ఉండాల్సిందే

Second Hand Car Using Tips: మీరు సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేస్తున్నారా ? లేదా ఆల్రెడీ సెకండ్ హ్యాండ్ కొన్నారా ? అయితే, మీరు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. లేదంటే కారు నడిపేటప్పుడు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇంతకీ ఆ తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం రండి.

Written by - Pavan | Last Updated : Apr 15, 2023, 08:15 PM IST
Second Hand Car: సెకండ్ హ్యాండ్ కారు కొన్నారా ? ఈ ఐదూ ఎప్పుడూ మీతో ఉండాల్సిందే

Second Hand Car Maintainance Tips: కార్ మెయింటెనెన్స్ చిట్కాలు: సెకండ్ హ్యాండ్ కార్లకు దేశంలో భారీగా డిమాండ్ ఉంది. అందుకే కేవలం సెకండ్ హ్యాండ్ కార్ల విక్రయాలపై ఆధారపడి కొన్ని కంపేనీలు కోట్ల కొద్ది వ్యాపారం చేస్తున్నాయి. ఎక్కువ బడ్జెట్ పెట్టి కొత్త కారు కొనలేని వారు సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేస్తుంటారు. పాత కారును కొనుగోలు చేయడంలో ఉన్న లాభం ఏంటంటే.. మీకు నచ్చిన మోడల్‌ను తక్కువ ధరలోనే సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా, కొత్తగా రోడ్ టాక్స్, భారీగా వెహికిల్ రిజిస్ట్రేషన్ ఖర్చులు చేయాల్సిన పని లేదు. ఇక లోన్ గురించి కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు. 

సెకండ్ హ్యాండ్ కార్లతో వచ్చిన ఇబ్బంది ఏంటంటే.. వాటిని ఉపయోగిస్తే కానీ వాటి కండిషన్ ఏంటనేది తెలిసే అవకాశం లేదు. కొన్నిసార్లు ఏ ఇబ్బంది లేకుండానే స్మూత్ గానే రన్ అవుతుండొచ్చు లేదంటే ఇంకొన్నిసార్లు అప్పుడప్పుడు కారు ఇబ్బంది పెడుతుండొచ్చు. మీరు ఎంత మంచి కండిషన్ లో ఉన్న సెకండ్ హ్యాండ్ కారును కొన్నప్పటికీ ఇలాంటి ఇబ్బందులు తప్పకపోవచ్చు. అందుకే సెకండ్ హ్యాండ్ కారును మెయింటెన్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అవేంటంటే..

1. ఎక్స్‌ట్రా ఫ్యూజ్:
పాత కార్లలో ఏదైనా లోపం తలెత్తినట్టయితే, ముందుగా దెబ్బతినేది ఫ్యూజ్‌లే. భారీ నష్టం జరగకుండా ఉండేందుకు ముందుగా ఫ్యూజ్ కొట్టేసేలా ఇంధనం వ్యవస్థ ఉంటుంది. అయితే, ఫ్యూజ్ పనిచేయకపోవడం వల్ల దారి మధ్యలో కారు ఆగిపోయి ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలాంటి సమయంలో మీ వెంట ఒక ఎక్స్‌ట్రా ఫ్యూజ్ ఉంటే.. ఆ ఇబ్బంది నుంచి బయటపడొచ్చు.

2. టో హుక్, రోప్
పాత కారు కండిషన్ సరిగ్గా లేనట్టయితే.. అవి మార్గం మధ్యలో ఎప్పుడైనా, ఎక్కడైనా ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. కొన్నిసార్లు కారు ఆగిపోతే తిరిగి స్టార్ట్ చేయడం కూడా కష్టమే. అదే కానీ జరిగితే మీ కారు రోడ్డు మధ్యలో ఆగిపోయి నానా న్యూసెన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాంటి ఇబ్బందుల నుంచి బయటపడేందుకు మీ వెంట ఒక టో హుక్, రోప్ ఉన్నట్టయితే.. రోడ్డు నడి మధ్యలో కారు ఆగిపోయినప్పుడు వాటి సహాయంతో రిలీఫ్ పొందవచ్చు.

3. పంక్చర్ రిపేర్ కిట్ , స్టెఫ్నీ
పాత కార్లకు టైర్ పంక్చర్ అవడం సర్వ సాధారణమైన సమస్య. అందుకు కారణం పాత కార్ల టైర్లు కూడా పాతగానే ఉండటం వల్ల అవి పంక్చర్ అయ్యేందుకు అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అందుకే మీ వెంట పంక్చర్ రిపేర్ కిట్‌ ఉన్నట్టయితే.. అలాంటి ఇబ్బంది ఎదురైనప్పుడు మరొకరి సహాయం కోసం వేచిచూడకుండా మీకు మీరే టైర్ రిపేర్ చేసుకోవడం లేదా స్టెఫ్నీతో టైర్ చేంజ్ చేసుకోవడం వంటి పనులు చేసుకోవచ్చు.

4. టైర్ ఇన్ఫ్లేటర్
ఒకవేళ టైర్ పంక్చర్ అయినట్టయితే.. పంక్చర్ సెట్ చేశాకా టైర్లో గాలి నింపేందుకు టైర్ ఇన్‌ఫ్లేటర్‌ ఉండాల్సిందే. రూ 5000 కంటే తక్కువ ధరలోనే నాన్యమైన టైర్ ఇన్‌ఫ్లేటర్‌ని కొనుగోలు చేయొచ్చు.

5. కారు ఇన్సూరెన్స్
సెకండ్ హ్యాండ్ కారు కొన్న తరువాత తక్షణమే చేయాల్సి పని ఏంటంటే.. మీ పేరిట రిజిస్ట్రేషన్ బదిలీ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే మీ పేరిట వెహికిల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు వెహికిల్ ఇన్సూరెన్స్ ఎంతో ఉపయోగపడుతుంది.

Trending News