ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం భారతదేశ ఆర్ధిక వృద్ధి రేటు త్వరలో 8.5 శాతానికి చేరుకోవచ్చు. ప్రపంచదేశాల్లో భారతదేశ ఆర్ధిక పరిస్థితి బాగుందనే చెప్పాలి. వేగంగా ఎదుగుతున్న ఆర్ధిక వ్యవస్థగా నిలుస్తోంది. ఇండియా ఆర్ధిక పరిస్థితిని మెరుగుపర్చడంలో దేశంలోని కొన్ని నగరాల పాత్ర కీలకంగా ఉంది. జీడీపీ ప్రకారం దేశ ఆర్ధిక వ్యవస్థకు తోడ్పాటు అందిస్తున్న టాప్ 10 నగరాలివే. ఇందులో ఏపీలోని విశాఖపట్నం పదవ స్థానంలో ఉండటం విశేషం.
1. ముంబై
దేశంలోనే కాదు..ప్రపంచంలోనే అత్యంత ధనిక నగరాల్లో ఒకటి. భారతదేశ ఆర్ధిక రాజధాని. ఆర్ధికంగా పటిష్టంగా ఉన్న నగరాల్లో దేశంలో మొదటి స్థానంలో ఉంది. ముంబై నగరం జీడీపీ 310 బిలియన్ డాలర్లుగా ఉంది.
2. న్యూఢిల్లీ
దేశంలో చారిత్రక, సాంస్కృతిక, రాజకీయ, సామాజికంగా ప్రాముఖ్యత ఉన్న నగరం. దేశ రాజధాని. ఈ నగరం జీడీపీలో 293.6 బిలియన్ డాలర్లతో రెండవ స్థానంలో ఉంది.
3. కోల్‌కతా
నార్త్‌ఈస్ట్ ఇండియాకు ఆర్ధిక, వాణిజ్య, పారిశ్రామిక కేంద్రం కోల్‌కతా అని చెప్పవచ్చు. ఈ నగరం జీడీపీలో 150.1 బిలియన్ డాలర్లతో మూడవ స్థానంలో ఉంది.
4. బెంగళూరు
ఇండియన్ సిలికాన్ వ్యాలీగా, కర్ణాటక రాష్ట్ర రాజధానిగా ఉన్న బెంగళూరులో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, భారత్ ఎర్త్ మూవర్స్ వంటి కంపెనీలతో జీడీపీలో 110 బిలియన్ డాలర్లతో నాలుగవ స్థానంలో ఉంది.
5. చెన్నై
జీడీపీలో 78.6 బిలియన్ డాలర్లతో దేశంలో ఐదవ స్థానంలో ఉన్న చెన్నై నగరానికి ఆటోమొబైల్ పరిశ్రమ చాలా కీలకం. ఐటీ, బీపీవో రంగాలు, ఆటోమొబైల్, మెడికల్ టూరిజం, పరికరాల ఉత్పత్తితో నగరం ఆర్ధికంగా వృద్ధి చెందుతోంది.
6. హైదరాబాద్
జీడీపీలో 75.2 బిలియన్ డాలర్లతో హైదరాబాద్ నగరం దేశంలో ఆరవ స్థానంలో నిలిచింది. సిటీ ఆఫ్ పెరల్స్‌గా హైదరాబాద్ నగరానికి పేరుంది. ఘనమైన చరిత్ర, మంచి భోజనం, వివిధ భాషల సంస్కృతి హైదరాబాద్ నగరం సొంతం
7. పూణే
ఐటీ సంస్థలు, కార్లు, వాహనాల పరిశ్రమలు, బీపీవో ట్రేడింగ్, కార్ల ఉత్పత్తిలో పూణేకు మంచి పేరుంది. టాటా మోటార్స్, రీనాల్ట్, వోక్స్‌వాగన్, మెర్సిడెస్ బెంజ్ పరిశ్రమలో ఈ నగరంలోనే ఉంన్నాయి. ఈ నగరం జీడీపీలో 69 బిలియన్ డాలర్లతో 7వ స్థానంలో నిలిచింది.
8. అహ్మదాబాద్
ఈ నగరానికి మాంచెస్టర్ ఆఫ్ ఈస్ట్ అని పిలుస్తారు. దేశంలో ఇదొక ధనిక నగరం. జీడీపీలో 68 బిలియన్ డాలర్లతో 8వ స్థానంలో ఉంది.
9. సూరత్
సిటీ ఆఫ్ సన్‌గా సూరత్ నగరాన్ని పిలుస్తారు. ఈ నగరంలో స్టోన్ కటింగ్, క్లీనింగ్ పరిశ్రమలు పెద్దసంఖ్యలో ఉన్నాయి. ఈ నగరం వజ్రాలకు ప్రసిద్ధి. జీడీపీలో 59.8 బిలియన్ డాలర్లతో 9వ ధనిక నగరంగా ఉంది.
10. విశాఖపట్నం
ఇక దేశంలోని ధనిక నగరాల్లో 10వ స్థానంలో ఏపీలోని విశాఖపట్నం ఉంది. సిటీ ఆఫ్ డెస్టినీగా, పోర్ట్ సిటీ ఆఫ్ ఇండియాగా ప్రాచుర్యం పొందిన నగరమిది. ఈ నగరం జీడీపీలో 43.5 బిలియన్ డాలర్లతో పదవ స్థానంలో ఉంది. ఈ జాబితా అంతా ఆ నగరాల్ని వస్తున్న సంపద ఆధారంగాలెక్కగట్టింది.
Also read: The Kashmir Files సినిమాను కించపరిచిన జ్యూరీ మెంబర్.. క్షమాపణలు చెప్పిన ఇజ్రాయెల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook