The Kashmir Files సినిమాను కించపరిచిన జ్యూరీ మెంబర్.. క్షమాపణలు చెప్పిన ఇజ్రాయెల్

Nadav Lapid at 53rd IFFI Goa ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా దేశంలో ఎంతటి సంచలనాన్ని క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. అలాంటి సినిమా మీద ఇజ్రాయిల్ ఫిల్మ్ మేకర్ నాదవ్ లాపిడ్ దారుణంగా మాట్లాడాడు. అదో ప్రచార పర్వం, వ్యక్తిగత అభిప్రాయాలను ప్రొజెక్ట్ చేసేలా ఉందని చెప్పుకొచ్చాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 29, 2022, 02:42 PM IST
  • గోవాలో ఫిల్మ్ ఫెస్టివల్‌ సందడి
  • ఇజ్రాయల్ ఫిల్మ్ మేకర్ కాంట్రవర్సీ
  • ది కాశ్మీర్ ఫైల్స్‌పై మళ్లీ చర్చలు
The Kashmir Files సినిమాను కించపరిచిన జ్యూరీ మెంబర్.. క్షమాపణలు చెప్పిన ఇజ్రాయెల్

Nadav Lapid The Kashmir Files : ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాను నార్త్ ఆడియెన్స్‌ను నెత్తిన పెట్టేసుకున్నారు. కాశ్మీర్‌లో హిందువుల మీద జరిగిన హత్యాకాండను కళ్లకు కట్టినట్టు చూపించారని బాధితులు థియేటర్లోనే కన్నీళ్లు పెట్టుకున్న ఘటనలెన్నో జరిగాయి. కాశ్మీర్ పండితులు అనుభవించిన వాటిని చూపించారంటూ నార్త్ ఆడియెన్స్‌ సినిమా మీద కలెక్షన్ల వర్షం కురిపించారు. అయితే ఇది మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉందని కొందరు ఈ సినిమాను వ్యతిరేకించారు. అయినా బాక్సాఫీస్ మీద మాత్రం ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించింది.

ఇలాంటి సినిమా మీద ఇజ్రాయల్ ఫిల్మ్ మేకర్ నాదవ్ లాపిడ్ అనే వ్యక్తి దారుణమైన కామెంట్లు చేశాడు. అది కూడా గోవాలో జరుగుతున్న 53వ ఫిల్మ్ ఫెస్టివల్లో అనేశాడు. ది కాశ్మీర్ ఫైల్స్ అనేది ప్రాపగాండ, పర్సనల్ ఒపీనియన్, వల్గర్‌ అన్నట్టుగా చిత్రీకరించేశాడు. దీనిపై ఇజ్రాయెల్ వెంటనే స్పందించింది. ఇంజ్రాయెల్ అంబాసిడర్‌ నాఓర్ గిలాన్ స్పందిస్తూ.. నాదవ్‌ను తిట్టేశాడు. ఆయన తరుపున, ఇజ్రాయెల్ తరుపున మేం ఇండియాకు సారీ చెబుతున్నామని చెప్పుకొచ్చాడు.

 

ఇండియా, ఇజ్రాయెల్ మధ్య మంచి సంబంధాలున్నాయి.. అవి అలానే కొనసాగాలి.. ఇండియా ఎప్పుడూ కూడా తన అతిథులను దేవుళ్లుగా భావిస్తుంది.. నిన్ను ఎంతో నమ్మకంతో వారు గెస్టుగా పిలిస్తే వారినే అవమానిస్తావా?.. నిన్ను గౌరవిస్తే నువ్ చేసేది ఇదేనా?.. అవార్డ్ ఫంక్షన్‌లో నువ్ అలా ఎందుకు మాట్లాడావో నాకు అర్థం కావడం లేదు.. 

మేం స్టేజ్ మీద ఆల్రెడీ చెప్పాం.. ఇండియా, ఇజ్రాయెల్ కామన్ ఎనిమీతో పోరాడుతోందని చెప్పాం.. కానీ నువ్వేమో ఇలా మాట్లాడేశావ్.. నువ్ ఇలా గొప్పగా మాట్లాడేసి ఇజ్రాయెల్‌కు వెళ్లిపోతావ్.. కానీ మేం ఇక్కడే ఉంటాం.. ఇజ్రాయెల్‌కు ప్రతీకగా ఇక్కడే ఉంటాం.. స్నేహాన్ని చెడగొట్టే ప్రయత్నం చేశావ్.. నిన్ను చూస్తుంటే సిగ్గుగా ఉంది.. అందరికీ క్షమాపణలు చెబుతున్నానంటూ సుధీర్ఘ ట్వీట్లు వేశాడు.

Also Read : Upasana Konidela : గుడ్ న్యూస్ చెప్పిన మెగా కోడలు.. కొత్త ఆరంభం అంటూ ఉపాసన పోస్ట్

Also Read : Ananya Panday latest Pics : అదరహో అనిపిస్తోన్న అనన్య.. పిచ్చెక్కిస్తోన్న లైగర్ పోరి

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News