Galaxy S22 Series Phones: రికార్డు స్థాయిలో బుకింగ్స్.. కేవలం 12 గంటల్లో 70 వేల ఫోన్లు ప్రీబుక్

Galaxy S22 Series Phones: శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ ప్రీ బుకింగ్స్‌‌కి కస్టమర్లు ఎగబడుతున్నారు. కేవలం 12 గంటల్లోనే 70 వేల పైచిలుకు ప్రీ బుకింగ్స్ జరగడం విశేషం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 24, 2022, 02:11 PM IST
  • శాంసంగ్ గెలాక్సీ ఎస్22 ప్రీ బుకింగ్స్
  • కేవలం 12 గంటల్లోనే 70వేల బుకింగ్స్
  • భారీ స్పందన వస్తోందన్న శాంసంగ్ ఇండియా
Galaxy S22 Series Phones: రికార్డు స్థాయిలో బుకింగ్స్.. కేవలం 12 గంటల్లో 70 వేల ఫోన్లు ప్రీబుక్

Galaxy S22 Series Phones: ఇటీవలే లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్‌కి కస్టమర్ల నుంచి భారీ స్పందన లభిస్తోంది.  బుధవారం (ఫిబ్రవరి 23) ఈ స్మార్ట్ ఫోన్ బుకింగ్స్‌ ప్రారంభమవగా.. కేవలం 12 గంటల్లోనే 70వేల ప్రీ బుకింగ్స్ జరిగినట్లు శాంసంగ్ ఇండియా వెల్లడించింది. కస్టమర్ల నుంచి వెల్లువెత్తుతున్న స్పందనకు కృతజ్ఞత తెలియజేస్తున్నట్లు పేర్కొంది.

'గెలాక్సీ ఎస్22 సిరీస్‌కి వస్తున్న స్పందన ఎంతో ప్రోత్సాహకంగా ఉంది. వీలైనంత త్వరగా కస్టమర్లకు ఈ డివైజ్‌లను అందించేందుకు కట్టుబడి ఉన్నాం.' అని శాంసంగ్ ఇండియా ప్రొడక్ట్ మార్కెటింగ్ హెడ్, సీనియర్ డైరెక్టర్ ఆదిత్య బబ్బర్ తెలిపారు. గెలాక్సీ ఎస్22 అల్ట్రా ప్రీ బుకింగ్‌పై రూ.26,999 విలువ చేసే గెలాక్సీ వాచ్4ని రూ.2699కే అందిస్తున్నారు. అలాగే గెలాక్సీ ఎస్22+ ప్రీ బుకింగ్‌పై రూ.11,999 విలువ చేసే గెలాక్సీ బడ్స్2ని కేవలం రూ.999కే అందిస్తున్నారు.

గెలాక్సీ ఎస్22 అల్ట్రా, గెలాక్సీ ఎస్22+, గెలాక్సీ ఎస్22 స్మార్ట్ ఫోన్లను రిటైల్ ఔట్‌లెట్స్‌, శాంసంగ్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్‌, శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్, అమెజాన్‌లో ఫిబ్రవరి 23 నుంచి మార్చి 10 వరకు ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. ఈ నెల 17న లాంచ్ అయిన ఈ గెలాక్సీ ఎస్22 సిరీస్ సేల్స్ మార్చి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. 8జీబీ ర్యామ్, 256 స్టోరేజ్‌తో కూడిన శాంసంగ్ గెలాక్సీ ఎస్22 ధర రూ.72,999గా ఉంది. 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌తో కూడిన గెలాక్సీ ఎస్22+ ప్రారంభ ధర రూ.84,999గా ఉంది. ఇక శాంసంగ్ గెలాక్సీ ఎస్22 అల్ట్రా ధర రూ.1,09,999గా ఉంది. ఇందులో టాప్ మోడల్ ధర రూ.1,18,999గా ఉంది. 

Also Read: Mithali Raj Retirement: వరల్డ్ కప్ తర్వాత క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించనున్న మిథాలీరాజ్!

Also Read: Mithali Raj: భరతనాట్యం నుంచి క్రికెట్ వరకూ సాగిన మిథాలీ రాజ్ కెరీర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News