Shamshabad Airport: తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాద్ విమానాశ్రయం. ఇప్పుడీ విమానాశ్రయం నిర్వహణ మరో 30 ఏళ్ల వరకూ జీఎంఆర్ సంస్థకే దక్కడం విశేషం..
హైదరాబాద్ నగరానికి 24 కిలోమీటర్ల దూరంలో శంషాబాద్ ప్రాంతంలో నిర్మించిన రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 2008 మార్చ్‌లో ప్రారంభమైంది. 5 వేల 495 ఎకరాల విస్తీర్ణంలో ఎయిర్‌పోర్ట్ భవనం నిర్మితమైంది. వైశాల్యం పరంగా దేశంలోనే అతిపెద్దదైన ఈ విమానాశ్రయాన్ని జీఎంఆర్ సంస్థ నిర్మించింది. ప్రపంచంలోని టాప్ 10 విమానాశ్రయాల్లో స్థానం పొందింది. పీపీపీ పద్ధతిలో ఈ విమానాశ్రయ నిర్మాణాన్ని 2004లో ప్రారంభించారు. ఆ ఒప్పందంలో భాగంగా నిర్మాణ సంస్థ జీఎంఆర్‌కు 2038 వరకూ అంటే మరో 16 ఏళ్ల వరకూ జీఎంఆర్ సంస్థకే ఎయిర్‌పోర్ట్ నిర్వహణ బాధ్యతలున్నాయి.
తాజాగా జీఎంఆర్ సంస్థకు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ నిర్వహణ బాథ్యతలు మరో 30 ఏళ్ల పాటు దక్కాయి. దీనికి సంబంధించిన పత్రాల్ని సివిల్ ఏవియేషన్ అథారిటీ జీఎంఆర్ సంస్థకు అప్పగించింది. అంటే హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ నిర్వహణ బాధ్యతల్ని 2068 మార్చ్ 23 వరకూ జీఎంఆర్ సంస్థే చూడనుంది. ప్రస్తుతం ఏడాదికి 21 మిలియన్ల మంది ప్రయాణిస్తుండగా..1.50 లక్షల టన్నుల సరుకు రవాణా అవుతోంది. ప్రస్తుతం ఈ విమానాశ్రయం విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఏడాదికి 35 మిలియన్ల మంది ప్రయాణించేలా ఏర్పాట్లు చేయనున్నారు.
Also read: Swiggy Drone Services: స్విగ్గీ వినూత్న ప్రయోగం, ఫోన్ చేస్తే చాలు..ద్రోన్ ద్వారా డెలివరీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook