Todays Gold Rate: స్వల్పంగా పెరిగిన బంగారం, దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధర

Todays Gold Rate: పసిడి ప్రియులకు బ్యాడ్‌న్యూస్. బంగారం ధర మరోసారి స్వల్పంగా పెరిగింది. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 10, 2022, 06:04 AM IST
Todays Gold Rate: స్వల్పంగా పెరిగిన బంగారం, దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధర

Todays Gold Rate: పసిడి ప్రియులకు బ్యాడ్‌న్యూస్. బంగారం ధర మరోసారి స్వల్పంగా పెరిగింది. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

బంగారం ధర రోజుకోసారి మారుతుంటోంది. బంగారం ధరపై చాలా రకాల కారణాలు ప్రభావితం చూపిస్తుంటాయి. అంతర్జాతీయంగా బంగారం డిమాండ్, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, డాలర్ విలువ , కరోనా మహమ్మారి వంటివి ప్రభావం చూపిస్తుంటాయి. అందుకే బంగారం ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఆ ధరలెలా ఉన్నాయో చూద్దాం.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల పసిడి ధర 45 వేల 410 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 49 వేల 540 రూపాయలుగా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 క్యారెట్ల ధర 45 వేల 550 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 690 రూపాయలుగా ఉంది. చెన్నై నగరంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 780 రూపాయలుండగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 950 రూపాయలుంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 550 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 540 రూపాయలుంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 550 రూపాయలుండగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 690గా ఉంది. కేరళలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 550 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 690 రూపాయలుగా ఉంది. 

ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో (Hyderabad Gold Price) 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 550 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 690 రూపాయలుంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 550 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 690 రూపాయలుంది. 

Also read: Instagram New Features: ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్.. అదేంటంటే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News