Netflix Free: ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్‌న్యూస్, ఆ ప్లాన్స్‌పై ఇక నెట్‌ఫ్లిక్స్ ఉచితం

Netflix Free: ఎయిర్‌టెల్ వినియోగదారులకు గుడ్‌న్యూస్. ఎంపిక చేసిన ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్‌పై ఇక నెట్‌ఫ్లిక్స్ కూడా ఉచితంగా అందనుంది. ఆ ఆఫర్లేంటి..నెట్‌ఫ్లిక్స్ ఎలా పొందాలనేది తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 3, 2022, 03:54 PM IST
Netflix Free: ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్‌న్యూస్, ఆ ప్లాన్స్‌పై ఇక నెట్‌ఫ్లిక్స్ ఉచితం

Netflix Free: ఎయిర్‌టెల్ వినియోగదారులకు గుడ్‌న్యూస్. ఎంపిక చేసిన ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్‌పై ఇక నెట్‌ఫ్లిక్స్ కూడా ఉచితంగా అందనుంది. ఆ ఆఫర్లేంటి..నెట్‌ఫ్లిక్స్ ఎలా పొందాలనేది తెలుసుకుందాం..

ఎయిర్‌‌‌టెల్ ఇటీవల కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ లాంచ్ చేసింది. ఈ ప్లాన్స్ ద్వారా తక్కువ ఖర్చుకే ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు. కొన్ని రకాల ఎయిర్ టెల్ ప్లాన్స్‌తో నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్పిప్షన్ కూడా ఉచితంగా లభించనుంది. అయితే ఇది కొన్ని ఎంపిక చేసిన సబ్‌స్క్పిప్షన్ ప్లాన్స్‌పై మాత్రమే. ఎయిర్‌టెల్ ప్రొఫెషనల్, ఇన్ఫినిటీ ప్లాన్స్‌తో నెట్‌ఫ్లిక్స్ ఉచితంగా అందనుంది.

ఎయిర్‌టెల్ ప్రొఫెషనల్ ప్లాన్ నెలకు 1498 రూపాయలు. ఇన్ఫినిటి ప్లాన్ అయితే నెలకు 3 వేల 999 రూపాయలుగా ఉంది. ప్రొఫెషల్ ప్లాన్‌తో 199 రూపాయల నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్ ఉచితంగా లభిస్తుంది. అదే ఇన్ఫనిటి ప్లాన్ తీసుకుంటే నెట్‌ఫ్లిక్స్ ప్రీమియమ్ ప్లాన్ 649 రూపాయలది నెల సబ్‌స్క్రిప్షన్ దొరుకుతుంది. ఇండియాలో నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్, బేసిక్ ప్లాన్, స్టాండర్డ్ ప్లాన్, ప్రీమియమ్ ప్లాన్ పేర్లతో నాలుగున్నాయి.

ఎయిర్‌టెల్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్స్‌పై నెట్‌ఫ్లిక్స్ పొందాలంటే ఇలా చేయండి

ముందుగా ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ ఓపెన్ చేసి డిస్కవర్ రివార్డ్ సెక్షన్‌లో నెట్‌ఫ్లిక్స్ క్లిక్ చేసి క్లెయిమ్ బటన్ ప్రెస్ చేయాలి. ఆ తరువాత నెట్‌ఫ్లిక్స్ ప్రొడక్ట్ పేజ్‌పై ప్రోసీడ్ ఎంచుకోవాలి.యాక్టివేట్ అయిన తరువాత నెట్‌ఫ్లిక్స్ పేజ్‌కు రీడైరెక్ట్ అవుతుంది.

Also read: LIC IPO Opens: మార్కెట్‌లోకి రానున్న జంబో ఐపీఓ, మొత్తం వివరాలు ఇవే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News