HDFC Merger News: భారతదేశ కార్పోరేట్ చరిత్రలో మరో కీలక పరిణామం జరగనుంది. ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లోకి హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ మోర్టగేజ్ రుణ సంస్థ విలీనం కానుంది. ఇదే విషయాన్ని తమ బోర్డు సభ్యులందరూ ఆమోదం తెలిపినట్లు హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ సోమవారం ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది.
ఈ విలీనంతో హెచ్‌డీఎఫ్‌సీ అనుబంధ సంస్థలైన హెచ్‌డీఎఫ్‌సీ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్, హెచ్‌డీఎఫ్‌సీ హోల్డింగ్స్ లిమిటెడ్ సంస్థలు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లిమిటెడ్‌లో విలీనం కానున్నాయి. అయితే ఈ విలీనానికి ప్రభుత్వ రంగ సంస్థలైన సెబీ, సీసీఐ, ఆర్‌బీఐ సహా ఇతర నియంత్రణా సంస్థల నుంచి అనుమతి రావాల్సి ఉంది.
హెచ్‌డీఎఫ్‌సీ సంస్థల విలీన ప్రక్రియ 2023-24 ఆర్థిక సంవత్సరానికి పూర్తయ్యే అవకాశం ఉంది. లేదంటే అదే ఫైనాన్షియల్ ఇయర్ లో రెండు లేదా మూడో త్రైమాసికం నాటికి విలీన ప్రక్రియ పూర్తవుతుందని అంచనా. హెచ్‌డీఎఫ్‌సీ సంస్థల విలీన వార్త వెలువడిన తర్వాత ఆయా సంస్థలకు సంబంధిచిన షేర్ల ధర భారీగా పెరిగింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ షేర్లు 15 శాతం మేర లాభపడ్డాయి.
Also Read: Petrol Diesel Price Hike: మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈసారి ఎంత పెరిగిందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook