Electric Scooter: మార్కెట్‌లోకి హీరో నుంచి ఎలక్ట్రానిక్ స్కూటర్..ఒక్క సారి చార్జ్‌ చేస్తే చాలు..

Hero Motocorp Electric Scooter:  పెట్రోల్ పై భారాన్ని తగ్గించుకునేందుకు అందరూ ఎలక్ట్రిక్ స్కూటీ లను కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇందులో భాగంగానే ప్రముఖ హీరో కంపెనీ తన మొట్టమొదటి ఈ స్కూటర్ ను విడుదల చేస్తున్నట్లు సమాచారం. దీనికోసం ఇప్పటికే పలు సన్నాహాలు కూడా చేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 7, 2022, 09:33 AM IST
  • మార్కెట్‌లోకి హీరో నుంచి ఎలక్ట్రానిక్ స్కూటర్..
  • దీని ధర 80 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఉండొచ్చు.
  • 115 NM టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.
Electric Scooter: మార్కెట్‌లోకి హీరో నుంచి ఎలక్ట్రానిక్ స్కూటర్..ఒక్క సారి చార్జ్‌ చేస్తే చాలు..

Hero Motocorp Electric Scooter: క్రమంగా పెరుగుతున్న ద్రవ్యాలు బలం కారణంగా పెట్రోల్ డీజిల్ రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ పెరుగుతున్న రేట్లు గమనిస్తే ఎప్పటికీ తగ్గకపోవచ్చు అనే సందేహం కలుగుతుంది. అయితే చాలామంది ఈ పెట్రోల్ రేట్లు నుంచి ఉపశమనం పొందడానికి ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. ఇవే ప్రస్తుతం మార్కెట్లో సంస్థలు ఎక్కువగా విక్రయిస్తున్నాయి. అయితే ప్రముఖ కంపెనీ అయినా హీరో తన ఈ స్కూటర్ ను విడుదల చేయబోతున్నట్లు ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ స్కూటర్ను ఈ మొబిలిటీ అనే బ్రాండ్ కింద విడుదల చేయనుంది. ఈ స్కూటర్ ద్వారా ఎలాంటి ఇబ్బంది లేకుండా దాదాపు రెండు లక్షల కిలోమీటర్లు డ్రైవింగ్ దాకా చేయొచ్చు.

హీరో ఈ స్కూటర్ ఫీచర్లు:
ఈ స్కూటర్ వివరాలను కంపెనీ ఇంకా వినియోదారులకు విడుదల చేయలేదు. కానీ మీడియాలో ఈ స్కూటర్ ఫ్యూచర్ ల వివరాలు చెక్కర్లు కొడుతున్నాయి. ఎలక్ట్రానిక్ స్కూటర్ గరిష్టంగా 3k w శక్తి సామర్థ్యాలను కలిగుందంట.. 115 NM టార్క్ ను ఉత్పత్తి చేస్తుందని సమాచారం. ఈ స్కూటర్ కి ఒకసారి చార్జింగ్ పెడితే దాదాపు 25 కిలోమీటర్లు నాన్ స్టాప్ గా నడుస్తుంది.

బ్యాటరీని మార్చుకుని సదుపాయం:
అన్ని మోటార్ సైకిల్స్ లా కాకుండా హీరో కొత్త ఫీచర్ ని తీసుకువచ్చింది. ఈ స్కూటర్లో బ్యాటరీ కూడా సాంకేతిక శక్తిని కలిగి ఉంటుందని ప్రచారం. బ్యాటరీ కి సంబంధించిన పార్ట్స్ పై హీరో కంపెనీ తైవానికి చెందిన ఓ ప్రముఖ కంపెనీతో ఇప్పటికే భాగస్వామ్యం చేసుకుందని సమాచారం. 

దేశంలో చార్జింగ్ స్టేషన్లను పెంచేందుకు హీరో కంపెనీ బిపిసిఎల్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. బెంగళూరు ఢిల్లీ సహా ఏడు నగరాల్లో చార్జింగ్ స్టేషన్లను సిద్ధం చేయబోతున్నట్లు ఇప్పటికే వార్తలు కూడా మనం చూశాం.

స్కూటర్ ఖర్చు:
ప్రముఖ హీరో కంపెనీ తన మొట్టమొదటి ఈ స్కూటర్లో యూఎస్బీ చార్జింగ్ పోర్ట్, ఎల్ఇడి లాంప్, స్మార్ట్ సెన్సార్ వంటి అధునాతన ఫీచర్లను తీసుకువస్తుంది కాబట్టి దీని ధర అధికంగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంకొందరైతే దీని ధర రూ. 80 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఉండొచ్చని అంటున్నారు.

Also Read: Adipurush 3D Teaser: 3డీలో ఆదిపురుష్ టీజర్.. జండూబామ్ అన్నారంటూ దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు!

Also Read: Nagababu on Garikapati: చిరంజీవిని విసుక్కున్న గరికపాటి..నాగబాబు ఘాటు కౌంటర్.. అసూయ పుట్టాల్సిందే అంటూ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News