Hindenburg Effect: హిండెన్‌బర్గ్ ఎఫెక్స్, ప్రపంచ ధనికుల జాబితా నుంచి అదానీ ఔట్

Hindenburg Effect: హిండెన్‌బర్గ్ ప్రభావం అదానీ గ్రూప్‌పై గట్టిగానే పడింది. ప్రపంచ సంపన్నుల జాబితా లో 3 వ స్థానంలో ఉన్న గౌతమ్ అదానీ..11వ స్థానానికి పడిపోయారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 31, 2023, 02:59 PM IST
Hindenburg Effect: హిండెన్‌బర్గ్ ఎఫెక్స్, ప్రపంచ ధనికుల జాబితా నుంచి అదానీ ఔట్

బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ల జాబితాలో మూడవ స్థానంలో ఉన్న అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ..ఏకంగా 11వ స్థానానికి పడిపోయారు. హిండెన్‌బర్గ్ నివేదిక ప్రభావంతో అదానీ షేర్ల పతనం ఇంకా కొనసాగుతూనే ఉంది. 

అదానీ గ్రూప్ స్టాక్ మార్కెట్‌లో అవకతవకలకు పాల్పడుతోందని..ఎక్కౌంటింగ్ మోసాలు చేస్తోందని హిండెన్‌బర్గ్ ఆరోపించింది. రెండేళ్లపాటు పరిశోధన అనంతరం నివేదికను నాలుగు రోజుల క్రితం విడుదల చేసింది. షెల్ కంపెనీలు, కుటుంబసభ్యులతో కలిసి షేర్ విలువను కృత్రిమంగా పెంచడం వంటి మోసాలకు పాల్పడిందనేది ప్రధాన ఆరోపణ. ఈ నివేదిక ప్రభావం షేర్ మార్కెట్‌పై భారీగా పడింది. నివేదిక విడుదలైన రెండ్రోజుల్లోనే 3వ స్థానంలో ఉన్న అదానీ..7వ స్థానానికి పడిపోయారు. అదానీ సంపదన 4 లక్షల 10 వేల కోట్లు ఆవిరైంది. ఆ తరువాత కూడా షేర్ల పతనం కొనసాగడంతో..ఇప్పుడు ఏకంగా 11వ స్థానానికి పడిపోయారు. 

ఇవాళ కూడా షేర్ల పతనం కొనసాగితే ఆసియాలోని అత్యంత ధనికుల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న గౌతమ్ అదానీ ఇక్కడి నుంచి కూడా కిందకు పడిపోవడం ఖాయం. ప్రస్తుతం అదానీ 82.2 బిలియన్ డాలర్లకు పడిపోయారు. మార్కెట్ విలువలో 68 బిలియన్ డాలర్లు తుడిచిపెట్టుకుుపోయాయి. హిండెన్‌బర్గ్ నివేదికకు సమాధానంగా అదానీ గ్రూప్ 413 పేజీల వివరణ ఇచ్చుకున్నా ఫలితం లేకపోయింది. జాతీయవాదం ముసుగులో మోసాన్ని కప్పిపుచ్చుకోలేరంటూ హిండెన్‌బర్గ్ మరోసారి ప్రకటించడంతో అదానీ కష్టాలు ఇంకా కొనసాగుతున్నాయి.

Also read: Maruti Suzuki: మరోసారి ధరల్ని పెంచిన మారుతి సుజుకి, త్వరలో మారుతి ఈవీ కారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News