Aghori: అఘోరిని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. అసలేం జరిగిందంటే..

Aghori: జనసేనాని ప్రస్తుతం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఈ రోజుతో అక్కడ ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఆ సంగతి పక్కన పెడితే.. జనసేనాని పవన్ ను కలిసేందకు హైవే పై అఘోరి రచ్చ చేసింది. విజయవాడ వెళ్లే రహదారిపై.. గుంటూరు జిల్లా మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం దగ్గర బైఠాయించింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Nov 18, 2024, 12:27 PM IST
Aghori: అఘోరిని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. అసలేం జరిగిందంటే..

Aghori: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో లేడీ నాగ సాధువు అఘెరి తన పర్యటనలతో సంచలనం రేపుతోంది. తాజాగా జనసేనాని పవన్  కళ్యాణ్ ను కలిసేందకు గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉన్న జనసేన కార్యాలయం దగ్గర హల్ చల్ చేయడం కలకలం రేపింది.  తాను  పవన్ కల్యాణ్ ను కలవాలని...కలిసిన తర్వాత వెళ్తానని హైవేపై నిరసన తెలిపారు. అఘోరీ నిరసనతో హైవేపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో హైవేపై నుంచి పక్కకు వెళ్లాలని రిక్వెస్ట్ చేసారు పోలీసులు. దీంతో పోలీసులపై చెయ్యి చేసుకున్నారు అఘోరీ. అటు  అఘోరీని చూసేందుకు జనం భారీగా తరలివస్తున్నారు.

Add Zee News as a Preferred Source

మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం ప్రస్తుతం....మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. దీంతో నిరసన తెలిపేందుకు హైవేపై కూర్చున్న అఘోరీకి సర్ధి చెబుతున్నారు పోలీసులు. పవన్ కళ్యాణ్ ఈ రోజు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం ముగించుకుని రానున్నారు. అంతేకాదు సరాసారి చంద్రబాబు తమ్ముడు కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అటు మంగళగిరిలోని తన నివాసానికి వెళ్లనున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలోని ముత్యాలమ్మ దేవాలయంపై జరిగిన దాడి ఘటనతో లేడీ అఘోరి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. అంతేకాదు తెలంగాణలో ముత్యాలమ్మ దేవాలయంతో పాటు పలు దేవాలయాల ఘటనపై లేడీ అఘోరి తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్.. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనడానికి అమరావతికి వచ్చారు. ఒకవైపు రాజకీయాలు చేస్తూనే.. మరోవైపు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ .. లేడీ అఘోరిని కలుస్తారా లేదా అనేది వెయిట్ అండ్ సీ.

ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..

ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News