Easy Tips To Save Money: డబ్బులను ఈజీగా పొదుపు చేసే మార్గాలు

Easy Tips To Save Money: సంపాదించే జీతం కంటే ఎక్కువ ఖర్చులు ఉండటం చాలామందిని తీవ్ర అయోమయానికి గురిచేస్తుంటాయి. అసలే ప్రతీ నెల ఒకటో తారీఖు కోసం వేచిచూసే వేతన జీవులు.. దానికి తోడు ఒక లెక్క పత్రం లేని ఖర్చులు పొదుపుని దెబ్బ తీస్తుంటాయి. మరి ఏం చేసి డబ్బులు పొదుపు చేయాలో తెలియడం లేదా ? అయితే ఈ డీటేల్స్ మీ కోసమే.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 25, 2023, 01:02 PM IST
Easy Tips To Save Money: డబ్బులను ఈజీగా పొదుపు చేసే మార్గాలు

Easy Tips To Save Money: బడ్జెట్ పద్మనాభం
ఓ పది, పదిహేనేళ్ల క్రితం జగపతి బాబు హీరోగా వచ్చిన బడ్జెట్ పద్మనాభం మూవీ చూసే ఉంటారు కదా.. నెల నెల ఇంట్లో పాల బిల్లు, కరెంట్ బిల్లు, కూరగాయలు, నిత్యావసరాలు, పిల్లల స్కూల్ ఫీజులు, అన్ని ఇతర ఖర్చులు కలిపి ఎన్ని ఖర్చులు ఉంటాయి, వచ్చే జీతంలోంచి ఆ ఖర్చులు పోగా ఎన్ని డబ్బులు పొదుపు చేయొచ్చు, అసలు పొదుపు చేయడానికి డబ్బులు మిగులుతాయా లేదా లేక ఇంకేమైనా అదనంగా డబ్బులు అవసరం పడతాయా అని అన్నిరకాల సంసారం ఖర్చుల బడ్జెట్ లెక్కల బాగోతమే బడ్జెట్ పద్మనాభం మూవీ. ఒకటో తారీఖు నాడు వచ్చే జీతం కోసం ఎదురుచూసే సామాన్యుల జీవితాల్లో ఈ బడ్జెట్ లెక్కలు తప్పకుండా ఉంటాయి. ఇవి ఖచ్చితంగా ఉండాల్సిందే. లేదంటే లెక్కకు మించి ఖర్చులు పెట్టి చేతిలో చిల్లిగవ్వ లేక అదోగతి పాలు కావాల్సి వస్తుంది. అంతేకాకుండా ఎక్కడ ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతున్నాయో తెలిసే అవకాశం కూడా ఉంటుంది. అలాంటప్పుడు ఆ ఖర్చులు తగ్గించుకుని పొదుపుపై దృష్టి పెట్టేందుకు వీలుంటుంది.

ఆటోమేటిక్ సేవింగ్స్
మీరు ఖర్చుల కోసం ఉపయోగించే బ్యాంక్ ఖాతా నుంచి కానీ లేదా మీ శాలరీ క్రెడిట్ అయ్యే బ్యాంక్ ఎకౌంట్ నుంచి కానీ మీ సేవింగ్స్ ఎకౌంట్లోకి ప్రతీ నెల ఒక ఫిక్స్‌డ్ ఎమౌంట్‌ని ఆటోమేటిక్ ట్రాన్స్‌ఫర్ సెట్ చేసి పెట్టుకోండి. మీ ప్రమేయం లేకుండానే మీరు డబ్బు పొదుపు చేసేందుకు అవకాశం ఉంటుంది. అలా పొదుపు చేసిన విషయాన్ని మీరు మర్చిపోండి. ఏదైనా అత్యవసర సమయంలో ఆ సేవింగ్స్ డబ్బులే మిమ్మల్ని ఆదుకుంటాయి. 

బయటి ఫుడ్ మానేయండి
బయటి ఫుడ్ ఖర్చుతో కూడుకున్నది మాత్రమే కాదు.. కొన్నిసార్లు అనారోగ్యం బారిన పడే ప్రమాదం కూడా ఉంటుంది. ఆ రెండూ మిమ్మల్ని ఆర్థికంగా చిక్కుల్లోకి నెట్టేవే. అందుకే ఇంట్లోనే వంట చేసుకుంటే తక్కువ ఖర్చుతో పని అయిపోవడమే కాకుండా మీ ఆరోగ్యం కూడా సేఫ్‌గా ఉన్నట్టే. 

అలాంటి వాటికి దూరంగా ఉండండి
మీరు మీ ఖర్చుల లెక్కలు మెయింటెన్ చేస్తున్నట్టయితే, అందులో ఉన్న అనవసర ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేయండి. సబ్ స్క్రిప్షన్స్ కానీ లేదా మీకు అంతగా అవసరం లేనివి ఏవైనా ఉంటే వాటిని పక్కకు పెట్టేయడం ద్వారా మీరు ఆ డబ్బులను మరో అత్యవసరానికి ఉపయోగించుకోవచ్చు అనే విషయం గుర్తుంచుకోండి.

ఎంతో అవసరం అయితేనే..
కొంతమందికి అవసరంతో సంబంధం లేకుండా చూసిన ప్రతీది, నచ్చిన ప్రతీ వస్తువు కొనే అలవాటు ఉంటుంది. మరీ ముఖ్యంగా బట్టల షాపింగ్ విషయంలో ఆ వీక్‌నెస్ ఉంటుంది. అది మంచి అలవాటు కాదు. మీకు ఎంతో అవసరం అయితే తప్ప ఏదీ అనవసరంగా కొనకూడదు. లేదంటే మీకు తెలియకుండానే నెల నెలా భారీ మొత్తం అనవసరం ఖర్చులకే పోతుంది.   

క్యాష్ బ్యాక్ ఆఫర్స్, రివార్డ్స్ పాయింట్స్..
తప్పనిసరి అవసరాలు కొనేటప్పుడు క్రెడిట్ కార్డులు, ఆన్‌లైన్ పేమెంట్ ప్లాట్‌ఫామ్స్ అందించే క్యాష్ బ్యాక్ ఆఫర్స్, రివార్డ్స్ పాయింట్స్ ఉపయోగించుకుని కొనుగోలు చేయడానికి ప్లాన్ చేయండి. అలా సేవ్ చేసిన ప్రతీ ఒక్క రూపాయి ఏదైనా ఇతర ఖర్చుల కోసం ఉపయోగపడుతుంది అనే విషయం మర్చిపోవద్దు.

మీ చేతిలోనే మీ విద్యుత్ బిల్లు
కొన్ని ఖర్చులు తగ్గించుకోవాలనుకున్నా తగ్గించుకోలేం. అలాగే ఇంకొన్ని ఖర్చులు తగ్గించుకునే మార్గం మీ చేతుల్లోనే ఉంటుంది. అందులో విద్యుత్ బిల్లు కూడా ఒకటి. అనవసరంగా లైట్స్, ఫ్యాన్ వేసి మర్చిపోవడం వంటి పనులు చేయొద్దు. అలాగే ఎక్కువ విద్యుత్ ఖర్చు అయ్యే ఏసీ, వాషింగ్ మెషిన్, ఫ్రిజ్, నీటి మోటర్ వంటి గృహోపకరణాల విషయంలోనూ పొదుపుగా ఉపయోగించుకోండి. అలా మీరు చేసే పొదుపు మీకు డబ్బులను ఆదా చేస్తుంది.

ఇది కూడా చదవండి : Tata Altroz Cars: టాటా ఆల్ట్రోజ్‌లో రెండు కొత్త వేరియంట్స్.. రెండూ చీప్ అండ్ బెస్ట్ కార్లే

ఎక్కువ వడ్డీ చెల్లించడం
మీరు తీసుకున్న రుణాలు, క్రెడిట్ కార్డుల బిల్లులు, ఇఎంఐలు సకాలంలో చెల్లించండి. లేదంటే అదనంగా చెక్ బౌన్స్ ఫీజులు, అదనపు వడ్డీలు చెల్లించాల్సి ఉంటుంది. మూలిగే నక్కపై తాటి పండు పడిన చందంగా అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మీపై అదనపు వడ్డీలు తడిసి మోపెడయ్యేలా చేస్తాయి.

ఇది కూడా చదవండి : Applying For Home Loan: హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేస్తున్నారా ? మీకు ఈ సమస్యల గురించి తెలుసా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News