Hyundai Offers: కొత్త కారు కొనాలనుకుంటున్నారా..హ్యుండయ్ నుంచి భారీ డిస్కౌంట్లు ఈనెలలోనే

Hyundai Offers: మీరు కొత్త కారు కొందామనుకుంటున్నారా..అయితే మీకే ఈ గుడ్‌న్యూస్. హ్యుండయ్ ఇండియా మూడు మోడల్స్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఆ మోడల్ కార్లేంటి, డిస్కౌంట్ ఎంత ఉందనేది పరిశీలిద్దాం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 11, 2022, 11:39 AM IST
  • హ్యుండయ్ ఎంపిక చేసిన కార్లపై ఈ నెలలో భారీ డిస్కౌంట్లు
  • హ్యుండయ్ గ్రాండ్ ఐ10 నియోస్, ఔరా, శాంత్రో కార్లపై ఏప్రిల్ 30 వరకూ డిస్కౌంట్లు
  • 28 వేల నుంచి 48 వేలవరకూ భారీ డిస్కౌంట్
Hyundai Offers: కొత్త కారు కొనాలనుకుంటున్నారా..హ్యుండయ్ నుంచి భారీ డిస్కౌంట్లు ఈనెలలోనే

Hyundai Offers: మీరు కొత్త కారు కొందామనుకుంటున్నారా..అయితే మీకే ఈ గుడ్‌న్యూస్. హ్యుండయ్ ఇండియా మూడు మోడల్స్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఆ మోడల్ కార్లేంటి, డిస్కౌంట్ ఎంత ఉందనేది పరిశీలిద్దాం..

కొత్త కారు కొందామని ఆలోచిస్తున్నారా..మీ కోసమే ఈ శుభవార్త. హ్యుండయ్ ఇండియా ఈ నెలలో అంటే ఏప్రిల్ 2022లో అద్భుతమైన ఆఫర్లు ప్రకటించింది. హ్యుండయ్ ఇండియా ముడు మోడల్స్‌పై భారీ డిస్కౌంట్ ఇవ్వనుంది. హ్యుండయ్‌కు చెందిన గ్రాండ్ ఐ10 నియోస్, ఔరా, శాంత్రో కార్లపై ఈ డిస్కౌంట్లు వర్తించనున్నట్టు కంపెనీ తెలిపింది. ఈ ఆఫర్లలో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ కలిపి ఉన్నాయి.

హ్యుండయ్ ఇండియా ఈ నెలలో కొన్ని ఎంపిక చేసిన మోడళ్లపై భారీ ఆకర్షణీయమైన ఆఫర్ ప్రకటించింది. ఈ నెలలో గ్రాండ్ ఐ 10 నియోస్, ఔరా, శాంత్రో కార్లపై ఈ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ ఆఫర్లలో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కైంట్ కూడా ఉన్నాయి. ఈ నెలలో మీరు కొత్త హ్యుండయ్ కారు కొందామని ప్లాన్ చేసుకుంటే..ఈ మూడు మోడల్స్ కార్లపై ఏకంగా 48 వేల వరకూ ప్రయోజనం పొందవచ్చు. కంపెనీ ప్రకటించిన ఈ డిస్కౌంట్ కేవలం ఈ నెలకే వర్తిస్తుంది. ఏప్రిల్ 30 తరువాత ఈ డిస్కౌంట్లు ఉండవు.

హ్యుండయ్ శాంత్రో

బడ్జెట్ సెగ్మెంట్ నుంచి ప్రారంభిస్తే..హ్యూండయ్ పాపులర్ బ్రాండ్ శాంత్రోపై ఈ నెలలో 28 వేల వరకూ ఆఫర్ ఇస్తోంది. ఈ కారు పెట్రోల్ మరియు సీఎన్జీ వెర్షన్లతో అందుబాటులో ఉంటుంది. హ్యుండయ్ శాంత్రోతో 1.1 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది.

హ్యుండయ్ గ్రాండ్ ఐ10 నియోస్

హ్యుండయ్ గ్రాండ్ ఐ10 నియోస్‌పై కంపెనీ ఈ నెలలో మొత్తం 48 వేల వరకూ ఆఫర్ ఇస్తోంది. అయితే కంపెనీ ఇంకా కచ్చితమైన డిస్కౌంట్ ప్రకటించలేదు. క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ ఎంత ఇచ్చారనేది ఇంకా తెలియలేదు. గ్రాండ్ ఐ10 నియోస్ ప్రాచుర్యంలో ఉన్న బెస్ట్ హ్యాచ్‌బ్యాక్ కారు.

హ్యుండయ్ ఔరా

ఇక కంపెనీకు చెందిన చవకైన సెడాన్ మోడల్ ఇది. ఈ కారును నేరుగా టాటా టిగోర్, హోండా ఎమేజ్‌తో పోల్చవచ్చు. హ్యుండయ్ ఔరాపై ఈనెలలో 48 వేల వరకూ ఆఫర్ ఇస్తోంది కంపెనీ. ఇందులో కూడా క్యాష్‌బ్యాక్, ఎక్స్చేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ ఉన్నాయి.

Also read: Amazon Tecno Pop 5 LTE: రూ.9 వేల విలువైన స్మార్ట్ ఫోన్ ను రూ.349లకే కొనేయండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook  

Trending News