Honda Dio 125 Scooter: స్మార్ట్ ఫీచర్స్‌తో లాంచ్ అయిన హోండా డియో 125 స్కూటర్.. ధర కూడా చాలా తక్కువే

Honda Dio 125 Scooter Price, Specifications: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా నుంచి టూవీలర్ మార్కెట్లోకి మరో కొత్త స్కూటర్ లాంచ్ అయింది. హోండా డియో 125 పేరిట గురువారం లాంచ్ అయిన ఈ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర కూడా తక్కువగానే ఉంది,

Written by - Pavan | Last Updated : Jul 15, 2023, 08:25 AM IST
Honda Dio 125 Scooter: స్మార్ట్ ఫీచర్స్‌తో లాంచ్ అయిన హోండా డియో 125 స్కూటర్.. ధర కూడా చాలా తక్కువే

Honda Dio 125 Scooter Price, Specifications: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా నుంచి టూవీలర్ మార్కెట్లోకి మరో కొత్త స్కూటర్ లాంచ్ అయింది. హోండా డియో 125 పేరిట గురువారం లాంచ్ అయిన ఈ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.83,400 గా నిర్ణయించినట్టు హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ప్రకటించింది. స్మార్ట్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.91,300 గా ఉంది అని కంపెనీ స్పష్టంచేసింది. ఇప్పటివరకు 110 సిసి ఇంజన్ కెపాసిటీతో వచ్చిన హోండా డియో ఇప్పుడు మరిన్ని కొత్త ఫీచర్లతో 125 సిసి ఇంజన్‌తో లాంచ్ అయింది. కొత్త ఫీచర్స్ కి తోడు కొంత స్పోర్టీ లుక్‌ సైతం జోడించారు.

స్కూటర్ కలర్ వేరియంట్స్ విషయానికొస్తే..
హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా డైరెక్టర్, ప్రెసిడెంట్ కమ్ సీఈఓ అయిన సుత్సుమా ఒటాని మాట్లాడుతూ, "హోండా డియో 125 ని సరికొత్త 125 cc ఇంజన్ తో ప్రత్యేకంగా రూపొందించడం జరిగిందని.. యువత అభిరుచిని దృష్టిలో పెట్టుకుని, వారి అవసరాలకు అనుగుణంగా డిజైన్ చేయడం జరిగింది " అని తెలిపారు. మోడల్ పరంగా హోండా డియో 125 స్కూటర్ రెండు వేరియంట్స్ లభించనుండగా.. కలర్ వేరియంట్స్ పరంగా హోండా డియో 125 స్కూటర్ పెరల్ సైరన్ బ్లూ, బర్ల్ డీప్ గ్రౌండ్ గ్రే, పెరల్ నైట్ స్టార్ బ్లాక్, మ్యాట్ మార్వెల్ బ్లూ మెటాలిక్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, మ్యాట్ సాంగ్రియా రెడ్ మెటాలిక్, స్పోర్ట్స్ రెడ్ కలర్ వేరియంట్స్ లో లభిస్తుంది. 

వేవ్ డిస్క్ బ్రేక్, అల్లాయ్ వీల్స్‌ వంటి ఫీచర్లు
వేవ్ డిస్క్ బ్రేక్, డియో 125 ఎడ్జీ హెడ్ ల్యాంప్స్, స్పోర్టీ ఎగ్జాస్ట్, మోడ్రన్ టైల్యాంప్, కొత్త స్ప్లిట్ గ్రాబ్ రైల్, అల్లాయ్ వీల్స్, ఆకర్షించే గ్రాఫిక్స్ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ ఈ హోండా డియో 125 స్కూటర్ సొంతం. స్మార్ట్ ఫైండ్, స్మార్ట్ అన్‌లాక్, స్మార్ట్ స్టార్ట్ వంటి అనేక స్మార్ట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 125 సీసీ ఇంజన్‌తో నడిచే ఈ స్కూటర్ ఓబీడీ 2 కంప్లయంట్ కి అనుగుణంగా రూపుదిద్దుకుంది. 

ఇది కూడా చదవండి : Cheap And Best Sunroof Cars: తక్కువ ధరలో లభించే సన్‌రూఫ్ ఫీచర్ ఉన్న కార్లు

ఐడ్లింగ్ స్టాప్ సిస్టమ్
హోండా డియో 125 కి ముందు భాగంలో 12 అంగుళాల ఫ్రంట్ వీల్‌ అమర్చారు. టెలిస్కోపిక్ సస్పెన్షన్‌ ఫీచర్ కూడా ఉంది. ఎగుడుదిగుడు రహదారుల్లోనైనా వేగంగా వెళ్లిపోయేలా 171 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌ ఉంటుంది. కొత్త బైకులు, స్కూటర్స్ లో వచ్చినట్టే ఇందులోనూ డిజిటల్ మీటర్‌ అమర్చారు. ఈ డిజిటల్ మీటర్‌ మీకు స్కూటర్ రేంజ్, యావరేజ్ ఫ్యూయల్ ఎఫీషియెన్సీ, రియల్ టైమ్ ఫ్యూయల్ ఎఫీషియెన్సీని సూచిస్తుంది. అలాగే ఇదే డిస్‌ప్లేలో ట్రిప్, క్లాక్, సైడ్ స్టాండ్ ఇండికేటర్, స్మార్ట్ కీ, బ్యాటరీ ఇండికేటర్, ఎకో ఇండికేటర్, సర్వీస్ డ్యూ ఇండికేటర్స్ కూడా కనిపిస్తాయి. Honda Dio 125 Scooter ప్రత్యేకత ఏంటంటే.. 25 ఐడ్లింగ్ స్టాప్ సిస్టమ్ కలిగిన ఈ స్కూటర్.. ట్రాఫిక్ సిగ్నల్ లేదా చిన్న బ్రేక్ తీసుకున్నప్పుడు ఇంజిన్‌ను సెల్ఫ్ ఆఫ్ చేస్తుంది. ఇది స్కూటర్ ఫ్యూయెల్ సేవింగ్‌కి ఉపయోగపడుతుంది.

ఇది కూడా చదవండి : MG ZS EV SUV car: మార్కెట్లోకి మరో కొత్త ఎలక్ట్రిక్ SUV కారు.. రన్నింగ్ కాస్ట్ కిమీకు 60 పైసలు మాత్రమే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News