INDIAN RUPEE రూపాయి విలువ నానాటికి పడిపోతోంది. తాజాగా చరిత్రలో ఎన్నడు కనీ వినీ ఎగురనంతగా పడిపోయింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు పెరగడంతో పెరుగుతున్న ముడిచమురు ధరలు... భారత వాణిజ్యం, కరెంట్ ఖాతాను దెబ్బతీస్తాయి. మార్కెట్లలో రిస్క్ తీసుకొని పెట్టుబడి పెట్టే వాళ్లు తగ్గిపోవడం, అంతర్జాతీయ కారణాల వల్ల డాలర్ బలం నానాటికీ పెరిగిపోవడం తదితర కారణాల వల్ల రూపాయి ఆల్-టైమ్ కనిష్ట స్థాయికి చేరుకుంది. దీనికి తోడు భారత్ లో పెట్టుబడుల పెట్టిన అంతర్జాతీయ సంస్థలు విదేశీ పెట్టుబడిదారులను అమ్మేసుకోవడం కూడా తోడు అవడంతో .... ప్రస్తుతం గ్రీన్‌బ్యాక్‌తో పోలిస్తే రూపాయి 0.7% క్షీణించి 77.43 కు పడిపోయింది.
కరోనా తర్వాత భారత్‌లో ధరల పెరుగుదల ఆగకపోవడంతో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. ఇది కూడా రూపాయి మారకం విలువ పతకానికి కారణమైంది. కరోనా తర్వాత అంతర్జాతీయంగా పలు దేశాల్లో ద్రవ్యోల్భణం పెరిగిపోతోంది. అయితే ఆయా దేశాలు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కఠిన చర్యలు అమలు చేశాయి. అయితే మన దగ్గర ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కారణంగా కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభుత్వాలు జంకడంతో ద్రవ్యోల్భణం పెరిగిపోయి రూపాయి మారకం విలువ పడిపోయింది.
భారత్‌లో ఆర్థిక మందగమనానికి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తోడు అవడంతో పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారని నివేదికులు వెల్లడించాయి. దీంతో తమ ఆదాయ మార్గాలకు ఎక్కడ సమస్యలు వస్తాయో అనే ఆందోళ కారణంగా మార్కెట్ సెంటిమెంట్లు దెబ్బతిన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు... భారత్ తన చమురు అవసరాలలో 85 % మేర దిగుమతి చేసుకోవడంతో పెరుగుతున్న వాణిజ్య బిల్లు పెట్టుబడిదారులను భయభ్రాంతులకు గురిచేసినట్లుగా సమాచారం. దేశీయంగా రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుతు తప్పనిసరి పరిస్థితుల్లో వడ్డీ రేట్లను ఇటీవలే పెంచింది. వడ్డీ రేట్లను పెంచడంతో .. దేశీయ క్యాపిటల్ మార్కెట్ల నుంచి ఫండ్స్ ఉపసంహరణ కొనసాగుతోంది. అవుట్‌ఫ్లోస్ పెరగడం, ఇన్ ఫ్లో తగ్గడం వల్ల వాణిజ్య లోటు నానాటికీ పెరిగిపోతోంది. ఇలా పలు కారణాల వల్ల రూపాయి విలువ కుప్పకూలుతోంది. ఈరకంగా డాలర్ మారకంలో రూపాయి వాల్యు భారీ నష్టాలను చవి చూడాల్సి వస్తోంది. ఇలా ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయిలకు రూపాయిని పడేశాయి. డాలర్ మారకంలో రూపాయి వాల్యు ట్రేడింగ్‌లో అత్యంత కనిష్ట స్థాయిలు 77.43ను తాకింది.
also read SBI Loans For LIC IPO: ఎస్బీఐ బంపరాఫర్.. ఎల్ఐసి ఐపివోలో షేర్స్ కొనడానికి రుణాలు
alsor read LIC IPO Status: ఎల్ఐసీ షేర్ పరిస్థితి ఎలా ఉంది, షేర్ మార్కెట్ నిపుణులు, ఏజెన్సీలు ఏం చెబుతున్నాయి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook