Jio Cheapest Plan: జియో సరికొత్త ప్లాన్.. రూ.395 రీఛార్జ్ ప్లాన్ తో 84 రోజుల వ్యాలిడిటీ!

Jio Cheapest Plan: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో.. కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. కేవలం రూ. 395 ధరకే 84 వ్యాలిడిటీని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో పాటు అనేక ప్రయోజనాలు కూడా వర్తిస్తాయి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 15, 2022, 03:09 PM IST
Jio Cheapest Plan: జియో సరికొత్త ప్లాన్.. రూ.395 రీఛార్జ్ ప్లాన్ తో 84 రోజుల వ్యాలిడిటీ!

Jio Cheapest Plan: దేశంలోనే నంబర్ వన్ ప్రైవేట్ టెలికాం నెట్ వర్క్ గా రిలయన్ల్ జియో అవతరించింది. కస్టమర్లను సరికొత్త రీఛార్జ్ ప్లాన్స్ తో ఆకట్టుకోవడం వల్లనే ఇది అగ్రస్థానంలో కొనసాగుతుంది. అతి తక్కువ ధరలకే ఎక్కువ ప్రయోజనాలు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు జియోలోని రూ. 395 రీఛార్జ్ ప్లాన్ తో ఎక్కువ రోజులు వ్యాలిడిటీతో కస్టమర్ల ముందుకు తీసుకొచ్చింది.  

'జియో వాల్యూ ప్యాక్' అంటే ఏమిటి?

'జియో వాల్యూ ప్యాక్' పేరుతో ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్ ను రూ. 395 ప్రవేశపెట్టారు. మీ ఇంట్లో వైఫై ఉంటే, ఈ ప్లాన్ మీకు ప్రయోజనకరంగా మారుతుంది. అయితే ఈ ప్లాన్ లో రోజువారీ డేట్ సౌకర్యం లేదు. ఎక్కువగా ఇంటర్నెట్ కోసం వైఫై మీద ఆధారపడే వాళ్లు ఈ ప్లాన్ కు మొగ్గు చూపుతారు. 

జియో ప్లాన్స్ ప్రయోజనాలు

రిలయన్స్ జియో రీఛార్జ్ ప్లాన్ ప్రకారం.. రూ. 395 రీఛార్జ్ తో మూడు నెలలు అంటే 84 రోజుల వ్యాలిడిటీ అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ లో 6GB హైస్పీడ్ డేటాను పొందుతారు. దీంతో పాటు రోజుకు 100 SMSలు, అపరిమిత కాలింగ్ సదుపాయం ఉంది. 

ఈ ప్లాన్ ద్వారా ఉచిత OTT సబ్ స్క్రిప్షన్ కూడా కస్టమర్లు పొందవచ్చు. రూ. 395 ప్లాన్ లో జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి అన్ని జియో యాప్ లను ఉచితంగా సబ్ స్క్రిప్షన్ సదుపాయం ఉంది. మార్కెట్లోని ఇతర టెలికాం సంస్థలతో పోలిస్తే ఇది అతి చౌకైన రీఛార్జ్ ప్లాన్! 

Also Read:  Tata Play 49 Plan: టాటా ప్లే DTH బంపర్ ఆఫర్.. రూ.49లకే ప్రముఖ OTTల సబ్‌స్క్రిప్షన్‌!

Also Read: Train Ticket Booking: రైలు ప్రయాణంలో లోయర్ బెర్తు బుక్ చేసుకోవాలంటే ఇలా చేయండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News