In September, formal employment creation accelerated, with 1.54 million official jobs created: దేశంలో కరోనా సంక్షోభం తర్వాత ఉద్యోగ అవకాశాలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి.
ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్ఓ) డేటా ప్రకారం.. ఈ ఏడాది సెప్టెంబర్‌లో 15.4 లక్షల మంది సంఘటిత రంగాల్లో ఉపాధి (Job creation in September ) పొందారు. అంతకు ముందు నెలలో (ఆగస్టులో) ఈ సంఖ్య 13.6 లక్షల మంది సంగటిత రంగాల్లో ఉద్యోగాలు పొందినట్లు తెలిసింది.
కొత్తగా సంఘటిత రంగాల్లో చేరిన ఉద్యోగాలకు.. ఆయా కంపెనీలు ఈపీఎఫ్ ఖాతాను తెరుస్తాయి. ఈ గణాంకాల ఆధారంగా సంఘటిత రంగాల్లో ఉద్యోగాలను లెక్కిస్తుంది (EPFO payroll data on Job creation) ఈపీఎఫ్ఓ.
స్టాటిస్టిక్స్, ప్రోగ్రామ్ ఇప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ వెల్లడించిన పేరోల్ డేటా ప్రకారం.. సెప్టెంబర్‌లో కొత్తగా 13.3 లక్షల మంది స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ పరిధిలో చేరారు. ఆగస్టులో ఈ సంఖ్య 13.4 లక్షలుగా ఉంది.
ఇక సెప్టెంబర్‌లో మొత్తం 72,923 మంది కొత్తగా నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్పీఎస్)లో చేరారు. ఆగస్టులో ఈ సంఖ్య 56,827గా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది జూన్‌లో అత్యధికంగా 78,265 మంది ఎన్‌పీఎస్‌లో చేరారు. ఆ తర్వాత మళ్లీ సెప్టెంబర్‌లోనే అత్యధికం.
Also read: Reliance Capital: అనిల్ అంబానీకి మరోషాక్- రిలయన్స్ క్యాపిటల్ బోర్డు రద్దు!
Also read: EPFO: గుడ్ న్యూస్- 21.38 కోట్ల ఖాతాల్లో వడ్డీ జమ చేసిన ఈపీఎఫ్ఓ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook