LIC IPO Update: ఎల్ఐసీ ఐపీఓ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వారికి షాకింగ్ న్యూస్. ఈ నెలలో ఎల్ఐసీ ఐపీఓకు వస్తుందని భావించినా.. అది జరగకకపోవచ్చని తెలుస్తోంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం నడుస్తున్న కారణంగా అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్ఐసీ ఐపీఓను మరోసారి సమీక్షించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా స్వయంగా ఈ విషయంపై స్పందించారు. ప్రముఖ వార్తా పత్రిక బిజినెస్ లైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ప్రభుత్వం ఎల్ఐసీ ఐపీఓను త్వరలో పూర్తి చేయాలనే ఆలోచనతోనే ఉందని వివరించారు. అయితే రష్యా-ఉక్రెయన్ మధ్య సంక్షోభం నేపథ్యంలో.. ఐపీఓపై పునరాలోచనలో పడినట్లు చెప్పారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో.. ఐపీఓ ఎప్పుడు వస్తుందనే విషయంపై మరోసారి సందిగ్ధత నెలకొంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశాలు కనిపించడం లేనందన.. ఐపీఓను వచ్చే ఆర్థిక సంవత్సరానికి వాయిదా వేసే అవకాశాలున్నాయని అంచనాలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై ప్రభుత్వం నుంచి మాత్రం ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ఐపీఓకు సంబంధం ఏమిటి?
ప్రపంచవ్యాప్తంగా ఏ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినా ఆ ప్రభావం ప్రపంచ దేశాలన్నింటిపైనా పడుతుంది. ఇందుకు కారణం ఆయా దేశాల మధ్య ఉండే వ్యాపార, వాణిజ్య సంబంధాలు.. ఆర్థికపరమై సంబగంధాలు కారణం కావచ్చు.
అందుకే రష్యా వంటి సుపర్ పవర్ దేశం ఇప్పుడు యుద్ధంలో ఉండటం.. ఉక్రెయిన్ సంక్షోభంలో చిక్కుకోవడం వంటివి ప్రపంచ దేశాలపై ప్రతికూలక ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో గత వారం రోజులుగా దేశీయంగా, అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లన్నీ కుదేలవుతున్నాయి. ఇలాంటి సమయాల్లో ఎల్ఐసీ ఐపీఓకు రావడం వల్ల.. అనుకున్న లక్ష్యాలు నెరవేరకపోవచ్చని విశ్లేషణలు వస్తున్నాయి. అందుకే ఎల్ఐసీ ఐపీఓను వాయిదా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
Also read: Electricity bill: వేసవిలో కరెంటు బిల్లు తగ్గాలంటే.. ఈ చిట్కాలు పాటించండి!
Also read: WhatsApp Banned Accounts: జనవరిలో 18.58 లక్షల భారతీయ ఖాతాలను బ్లాక్ చేసిన వాట్సప్ సంస్థ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook