Mallareddy Girls Hostel: మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డికి చెందిన సీఎంఆర్ కాలేజీలో దారుణం చోటు చేసుకుంది. చదవు కోసం కన్నవాళ్లను విడిచిపెట్టి ఎంతో దూరంలో హాస్టల్ లో చదువుకుంటున్న విద్యార్ధినిలకు ఇపుడు సీక్రెట్ కెమెరాలు భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. మేడ్చల్ జిల్లా కండ్లకోయలో ఉన్న మల్లారెడ్డి కాలేజ్ గర్ల్స్ హాస్టల్ బాత్రూమ్ లో కొంత మంది విద్యార్దినులు స్నానం ఇతరత్రా కార్యక్రమాలు చేస్తుండగా సీక్రెట్ గా వీడియోలు చిత్రీకరించిన ఘటన ఇపుడు తెలంగాణలో కలకలం రేపుతోంది. దీంతో విద్యార్థినుల తల్లిదండ్రులు చదవు కోసం ఇతర ప్రాంతాలకు పంపించాలంటే భయపడే పరిస్థితులు నెలకున్నాయి. మల్లారెడ్డి కాలేజీలో జరిగిన ఈ దారుణంలో నిందితులు సుమారు 300 వీడియోలు రికార్డ్చేసినట్లు విద్యార్థినులు ఆరోపిస్తున్నారు.
ఈ సందర్భంగా విద్యార్థినుల అసభ్యకరమైన వీడియోలు తీసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వీడియోల ఘటనపై కళాశాల యాజమాన్యం వెంటనే స్పందించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అర్థరాత్రి విద్యార్థినిలు ఆందోళన చేయడంతో..పోలీసులు కాలేజీ వద్దకు చేరుకుని విద్యార్థినులతో మాట్లాడారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామంటూ హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. వీడియోలు సోషల్ మీడియాలో లీక్ అయితే ఎమ్మెల్యే మల్లారెడ్డే బాధ్యత వహించాలని హెచ్చరించారు.
3 నెలలుగా వీడియో రికార్డింగ్ జరుగుతున్నప్పటికి దానిని బయటకు రాకుండా గోప్యంగా ఉంచిన యాజమాన్యం. ఎవరైనా ప్రశ్నిస్తే.. విద్యార్థినిల వీడియోలు కూడా బయటపెడతామని బ్లాక్ మెయిల్ చేస్తోన్న యాజమాన్యం. ఇలాంటి ఘటనల నేపథ్యంలో ఇప్పటికే అనేక మంది విద్యార్థినిలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కనీస విచారణ చేపట్టని ప్రభుత్వం.ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని, బాధ్యులైన యాజమాన్యాన్ని అదుపులోకి తీసుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ABVP ధర్నా చేపట్టింది. విద్యార్థినిలను బ్లాక్ మెయిల్ కు గురి చేస్తున్న సీఎంఆర్ కళాశాలని సీజ్ చేసి విద్యార్థినులను రక్షించాలని డిమాండ్.
ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..
ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.