Budget 2024 Announcement In Telugu: కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 8 నెలలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రిగా ఆమె నేడు ఏడోసారి బడ్జెట్‌ను సమర్పించనున్నారు. ట్యాక్స్ బెనిఫిట్స్‌పై మధ్యతరగతి ప్రజలు భారీ ఆశలు పెట్టుకోగా.. జీతాల పెంపు, పే కమిషన్ ఏర్పాటు ప్రకటనలు ఉంటాయని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నమ్మకంతో ఉన్నారు. మరోవైపు మండుతున్న నిత్యావసర ధరలను నియంత్రించేందుకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటానేది ఆసక్తికరంగా మారింది. బడ్జెట్‌పై ఉభయ సభల్లో చెరో 20 గంటలపాటు చర్చ జరగనుంది. ఇప్పటికే సభా నిర్వహణకు ఎజెండా ఖరారు అయింది. మోదీ 3.O బడ్జెట్ అటు అభివృద్ధి, ఇటు సంక్షేమానికి బడ్జెట్‌లో సమతూకం ఉంటుందా..? నిర్మలమ్మ ప్రజలపై వరాల జల్లు కురిపిస్తారా..? బడ్జెట్ లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Union Budget 2024-25 Live Updates: కేంద్ర బడ్జెట్ 2024.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు..