LPG Gas Price: పండుగ వేళ సామాన్యుడికి షాక్, పెరగనున్న వంట గ్యాస్, ఎంత పెరుగుతుందంటే

LPG Gas Price: పండుగల వేళ సామాన్య ప్రజానీకానికి షాక్ తగలనుంది. వంట గ్యాస్ ధరల్లో మరోసారి పెరుగుదల కన్పించనుంది. గ్యాస్ సిలెండర్ ధర ఏ మేరకు పెరగనుందో తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 4, 2022, 06:55 PM IST
LPG Gas Price: పండుగ వేళ సామాన్యుడికి షాక్, పెరగనున్న వంట గ్యాస్, ఎంత పెరుగుతుందంటే

LPG Gas Price: పండుగల వేళ సామాన్య ప్రజానీకానికి షాక్ తగలనుంది. వంట గ్యాస్ ధరల్లో మరోసారి పెరుగుదల కన్పించనుంది. గ్యాస్ సిలెండర్ ధర ఏ మేరకు పెరగనుందో తెలుసుకుందాం..

సామాన్య ప్రజలకు పండుగ సీజన్‌లో గట్టిదెబ్బే తగులుతోంది. పండుగ వేళ గ్యాస్ సిలెండర్ ధరల పెరుగుదలతో షాక్ తగలుతోంది. గ్యాస్ సిలెండర్ ధరలు భారీగా పెరగనున్నాయి. సహజవాయువు ధరల్లో పెరుగుదలతో గ్యాస్ సిలెండర్, సీఎన్జీ, పీఎన్జీ ధరలు పెరగనున్నాయి. ఆ ప్రభావం నేరుగా సామాన్యుడిపైనే పడనున్నాయి.

ఇటీవల సహజ వాయువు ధరలు వీపరీతంగా పెరిగాయి. ఫలితంగా సీఎన్జీ ధరలు 8 నుంచి 12 రూపాయలవరకూ పెరగవచ్చాయి. అటు పీఎన్జీ ఆధారిత వంట గ్యాస్ ధర యూనిట్ 6 రూపాయలు పెరగనుంది. సహజ వాయువు గ్యాస్ ధర 9 డాలర్ల నుంచి 12 డాలర్ల వరకూ పెరిగింది. ఫలితంగా ధరలు పెరగనున్నాయి.

కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్వీటీస్ ప్రకారం గత ఏడాదిలో గ్యాస్ ధరలో దాదాపుగా 5 రెట్లు పెరుగుదల నమోదైంది. సెప్టెంబర్ 2021లో 1.79 డాలర్లు ఉండేది. ఇప్పుడు ఈ ధర దాదాపుగా 8.57 డాలర్లకు చేరుకుంది. ఇది కాకుండా ఐసీఐసీఐ సెక్ ప్రకారం క్రూడ్ ఆయిల్ ధరల్లో భారీగా పెరుగుదల నమోదైంది. దీని ప్రభావం గ్యాస్ ధరలపై పడుతోంది. 

ఇటీవల ఎంజీఎల్ సంస్థ సీఎన్జీ-పీఎన్జీ ధరల్ని పెంచింది. సీఎన్జీ ధరలు కిలోగ్రాముకు 6 రూపాయలు పెరిగింది. అదే సమయంలో పైప్ ద్వారా సరఫరా అయ్యే వంట గ్యాస్ ధర అంటే పీఎన్జీ ధర కూడా యూనిట్‌కు 4 రూపాయలు పెరిగింది. 

Also read: NPS Pension: రిటైర్మెంట్ తరువాత నెలకు 2 లక్షల పెన్షన్, ఇలా చేస్తే చాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News