Maruti Suzuki New Swift: ఇండియాలో ఎంట్రీ ఇచ్చేస్తున్న మారుతి సుజుకి న్యూ స్విఫ్ట్, ఫీచర్లు ఇలా

Maruti Suzuki New Swift: మారుతి సుజుకి కార్లలో అత్యంత ప్రాచుర్యం పొందిన కారు మారుతి స్విఫ్ట్. ఇప్పుడు మారుతి స్విఫ్ట్ కొత్త వెర్షన్ లాంచ్ కానుంది. జపాన్‌లో ఇప్పటికే లాంచ్ అయినా మారుతి సుజుకి న్యూ స్విఫ్ట్ త్వరలో ఇండియన్ మార్కెట్‌లో ఎంట్రీ ఇవ్వనుంది.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 3, 2024, 06:11 AM IST
Maruti Suzuki New Swift: ఇండియాలో ఎంట్రీ ఇచ్చేస్తున్న మారుతి సుజుకి న్యూ స్విఫ్ట్, ఫీచర్లు ఇలా

Maruti Suzuki New Swift: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మారుతి సుజుకి స్విఫ్ట్ త్వరలో భారతీయ మార్కెట్‌లో లాంచ్ కానుంది. ఇప్పటికే జపాన్ మార్కెట్‌లో లాంచ్ అయిన గ్లోబల్ మోడల్‌లో పోలిస్తే ఇండియాలో లాంచ్ అయ్యే మోడల్‌లో ఫీచర్లు కొద్దిగా మారవచ్చు. ఇండియాలో మారుతి సుజుకి నెక్ట్స్ జెన్ స్విఫ్ట్ టెస్టింగ్ సందర్భంగా భారతీయ రోడ్లపై హల్‌చల్ చేసింది. 

మారుతి సుజుకి నెక్స్ట్ జెన్ స్విఫ్ట్ టెస్టింగ్ సందర్భంగా కారు మొత్తం కవర్ చేసుండటంతో అవుటర్ లుక్, ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలియలేదు. ఈ కారులో ఏడీఏఎస్, వెంటిలేటెడ్ సీట్లు ఉండకపోవచ్చు. గతంలో ఉన్న మోడల్‌తో పోలిస్తే ఈ మోడల్ ఇంకాస్త్ స్లీక్‌గా స్పోర్టీగా కన్పిస్తోంది. డ్యూయల్ ఫంక్షన్ ప్రోజెక్టర్ లైట్లతో ఆకర్షణీయమైన హెడ్ ల్యాంప్‌తో వస్తోంది. ఎల్‌ఈడీ డీఆర్ఎల్ క్లస్టర్‌లో ఇంటిగ్రేటెడ్ మార్పుుల చేశారు. ఇక టర్న్ ఇండికేటర్స్‌ను సరిగ్గా దిగువన అమర్చినట్టు తెలుస్తోంది. 

మారుతి సుజుకి నెక్స్ట్ జెన్ స్విఫ్ట్ సైడ్ ప్రొఫైల్ అయితే కాస్త పొడుగ్గా కన్పిస్తుంది. డోర్‌కు హ్యాండిల్ ఇవ్వబడింది. ఫ్లోటింగ్ టైప్ రూఫ్ డిజైన్ ఉంటుంది. కారు వెనుక భాగం కూడా రీ డిజైన్ ్యింది. ఇందులో ఎల్ఈడీ ఎలిమెంట్స్‌తో క్లియర్ లెన్స్ టెయిల్ ల్యాంప్స్ ఉండవచ్చు. ఈ కారు టాప్ ఎండ్ మోడల్ మరింత విభిన్నంగా ఉంటుంది. రేర్ విండ్ స్క్రీన్ వైపర్, డీఫాగర్, ఎల్లాయ్ వీల్స్ ఉంటాయి. ఇక వేరే వేరియంట్స్‌లో హేలోజన్ లైట్స్, ఉంటాయా లేదా అనేది ఇంకా తెలియదు. 

కొత్త స్విఫ్ట్ లోపలి భాగంలో ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ ఇన్‌ఫో‌టైన్‌మెంట్ సిస్టమ్, 360 డిగ్రీల కెమేరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్, కలర్ ఎమ్ఐడీ, ట్విన్ పాడ్ అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఉంటాయి. సుజుకికు చెందిన కొత్త 1.2 లీటర్ , 3 సీలెండర్, నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇందులో మేన్యువల్ వెర్షన్ ఏడబ్ల్యూడీ ఫీచర్‌తో వస్తుంది. ఇండియాలో కొత్త స్విఫ్ట్ 5 స్పీడ్ మేన్యువల్, 5 స్పీడ్ ఏఎంటీ గేర్ బాక్స్ ఆప్షన్‌తో రావచ్చు. ఈ ఏడాది జూన్ నాటికి మారుతి సుజుకి కొత్త స్విఫ్ట్ ఇండియాలో లాంచ్ కావచ్చని అంచనా. 

Also read: Bajaj Cng Bikes 2024: రోడ్లపై పరుగులు పెట్టనున్న బజాజ్ CNG బైక్స్.. పూర్తి వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News