New Skoda Kodiaq Price 2023: స్కోడా కంపెనీ మార్కెట్లోకి తన మొదటి SUV కారుని విడుదల చేసింది. కోడియాక్ అనే పేరుతో ఈ సెవెన్ సీటర్ కార్ మార్కెట్లోకి విడుదలయ్యింది. ఇంతకుముందే 2017లో SUV మోడల్ విడుదల చేసినప్పటికీ పెద్దగా క్రయవిక్రయాలు జరగలేవు.. అయితే ఇటీవల విడుదల చేసిన కారుకి మంచి గుర్తింపు లభించింది. మొదట కంపెనీ కేవలం 750 కార్లను తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేయగా.. విక్రయాలను బట్టి మరికొన్నిటిని కార్లను విడుదల చేయనుంది. స్కోడా కొడియాక్ స్టైల్ వేరియంట్ భారత మార్కెట్లో రూ. 37.99 ప్రారంభమై.. వేరియంట్లను బట్టి రేట్లు అందుబాటులో ఉన్నాయి.
ఇంజన్ స్పెసిఫికేషన్స్:
స్కోడా కోడియాక్ బిఎస్ సిక్స్ ఇంజిన్తో లభిస్తోంది. అంతేకాకుండా 2.0 పెట్రోల్ ఇంజన్ తో పాటు..EVO టర్బో వంటి చాలా రకాల చాలా రకాల కొత్త ఫీచర్లతో అందుబాటులోకి రానుంది. ఇక ఇంజన్ 320Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
వేగం, మైలేజ్ వివరాలు:
ఇంతకుముందు విడుదలైన SUV కార్ల కంటే ఇందులో 4.2 శాతం ఎక్కువ ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉందని స్కోడా పేర్కొంది. అంతేకాకుండా ఈ కారు గరిష్టంగా 7.8 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగంతో గమ్యాన్ని చేర్చగలదు. ఈ కారులో ఆరు రకాల స్పీడ్ మోడ్లను కంపెనీ అందిస్తోంది. ప్రస్తుతం ఈ కోడియాక్ లో ఎకో, కంఫర్ట్, నార్మల్, స్పోర్ట్, ఇండివిజువల్, స్నో మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ అంతేకాకుండా ఈ కారు 4×4 సామర్థ్యంతో మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది.
ప్రత్యేకమైన ఫీచర్లు:
అన్ని పనిలా SUVలతో పోలిస్తే..కోడియాక్ డోర్ ఎడ్జ్ ప్రొటెక్టర్‌లతో వస్తుంది. ఈ ఫీచర్ తో డ్రైవ్ చేసే క్రమంలో విశ్రాంతితోపాటు మంచి అనుభూతిని పొందగలుగుతారు. అంతేకాకుండా రెండవ వరుసలో కూడా హెడ్‌రెస్ట్‌లు ఉండడం విశేషం..కోడియాక్ మృదువైన స్టీరింగ్, డైనమిక్ కంట్రోల్ ను కలిగి ఉంటుంది. దీంతో మీరు ఆఫ్ రోడ్ లో ప్రయాణం చేసేటప్పుడు.. మంచి అనుభూతిని పొందగలుగుతారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి