RBI Repo Rate : వరుసగా పదోసారి రెపో రేట్లను స్థిరంగా ఉంచుతూ ఆర్బీఐ నిర్ణయం..ఈఎంఐ తగ్గుతుందని ఆశించే వారికి తప్పని నిరాశ

RBI October MPC Review: ఆర్బిఐ వరుసగా పదో సారి కూడా రెపో రేట్లను స్థిరంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో చాలా కాలంగా ఈఎంఐ భారం తగ్గుతుందని ఆశించిన రుణగ్రహితలకు షాక్ తగిలింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written by - Bhoomi | Last Updated : Oct 9, 2024, 12:33 PM IST
RBI Repo Rate : వరుసగా పదోసారి రెపో రేట్లను స్థిరంగా ఉంచుతూ ఆర్బీఐ నిర్ణయం..ఈఎంఐ తగ్గుతుందని ఆశించే వారికి తప్పని నిరాశ

RBI Repo Rate Decision: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరుసగా మూడు రోజుల భేటీ అనంతరం కీలకమైన వడ్డీరేట్లపై నిర్ణయం తీసుకుంటే... ఇందులో భాగంగా ద్రవ్యోల్బనాన్ని అదుపులో ఉంచేందుకు వరుసగా పదవ సారి రెపోరేట్లను స్థిరంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రెపోరెట్లు 6.5% చొప్పున ఉన్నాయి. రెపోరేట్లు అనేవి ఆర్బిఐ బ్యాంకులకు అందించే రుణంపై వసూలు చేసే వడ్డీ. బ్యాంకులు ఆర్బీఐ నుంచి రుణాన్ని పొంది ఆ డబ్బును కస్టమర్లకు రుణం రూపంలో అందిస్తుంది. 

బ్యాంకులు ఆర్బీఐ నుంచి 6.5% వడ్డీతో రుణాన్ని తెచ్చుకుంటే, ఇప్పుడు అదే డబ్బును తమ కస్టమర్లకు 8 శాతం నుంచి 16 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తూ వివిధ కేటగిరీల్లో రుణాలను అందిస్తాయి. వీటిలో ప్రధానంగా హోం లోన్స్, వెహికల్ లోన్స్, పర్సనల్ లోన్స్ ఉంటాయి. ఆర్బీఐ రెపోరేటును పెంచితే, బ్యాంకులు సైతం తమ కస్టమర్లకు ఇచ్చే రుణాలపై వడ్డీని పెంచుతాయి. అప్పుడు కస్టమర్లకు నెలనెలా చెల్లించే EMI భారం పెరుగుతుంది. అందుకే కస్టమర్లు ఆర్బిఐ రెపో రేటును తగ్గిస్తే మంచిది అని భావిస్తూ ఉంటారు. అప్పుడు వారి EMI భారం తగ్గుతుంది. 

ఇదిలా ఉంటే, వరుసగా ఆర్బిఐ పదవ సారి కూడా రెపోరేటును స్థిరంగా ఉంచడం వెనుక ద్రవ్యోల్బణాన్ని కట్టడిలో ఉంచడమే కారణంగా చెప్పవచ్చు. ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ తన నిర్ణయంలో రెపో రేటును 6.5% వద్ద స్థిరంగా ఉంచడానికి ద్రవ్య విధాన కమిటీ మెజారిటీ నిర్ణయం తీసుకుందని తెలిపారు. తమి ఎంపీసీ కమిటీలోని 6 గురు సభ్యుల్లో 5-1 మెజారిటీతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Also Read:  EPFO: ఈపీఎఫ్ఓ ద్వారా మీకు నెలకు రూ. 10 వేల పెన్షన్ కావాలంటే..మీ బేసిక్ సాలరీ ఎంత ఉండాలో తెలుసుకోండి

ఈ ఆర్థిక సంవత్సరం 2024-25 మొదటి త్రైమాసికంలో వాస్తవ జిడిపి 6.7% పెరిగిందని ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ తన ప్రసంగంలో తెలిపారు. ప్రపంచ వాణిజ్యం కుంటు పడిన నేపథ్యంలో జులై, ఆగస్టులో ప్రధాన ద్రవ్యోల్బణం పెరిగిందన్నారు. అటు రిటైల్ ద్రవ్యోల్బణం భారీగా పెరిగే అవకాశం ఉందన్నారు. రెపో రేటు 6.50 శాతం వద్ద స్థిరంగా ఉండగా, రివర్స్ రెపో రేటు 3.35 శాతం వద్ద స్థిరంగా ఉంది. 

ఇక బ్యాంక్ రేటు 6.75% వద్ద స్థిరంగా ఉంది. సెంట్రల్ రిజర్వ్ బ్యాంక్ యొక్క MPC సమావేశం ప్రతి రెండు నెలలకు ఒకసారి జరుగుతుంది. ఇందులో గవర్నర్‌తో సహా 6 మంది సభ్యులు ద్రవ్యోల్బణం, రెపో రేటు వంటి అంశాల్లో మార్పుల గురించి చర్చించి విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటారు.

Also Read: Gold Rate Today: కొండ దిగిన వెండి..ఊరటనిచ్చిన పసిడి.. ఈ సమయంలో బంగారం కొనొచ్చా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x