National Pension System Latest Update: నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్కీమ్ నుంచి నగదు విత్ డ్రా చేసుకోవడానికి అమలు చేయబోతున్నారు. ఈ నిబంధన ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. కొత్త నిబంధన ప్రకారం కొన్ని పత్రాలను ఇవ్వడం తప్పనిసరి. చందాదారులు ఈ పత్రాలను అప్‌లోడ్ చేయకపోతే.. వారు ఎన్‌పీఎస్ నుంచి నగదు ఉపసంహరించుకోలేరు. ఈ మేరకు పీఎఫ్‌ఆర్డీఏ ఉత్తర్వులు జారీ చేసింది. చందాదారులకు కేవైసీ పత్రాలు సమర్పించడమం తప్పనిసరి అని పేర్కొంది. ఈ పత్రాలను కచ్చితంగా అప్‌లోడ్ చేసేలా చూడాలని నోడల్ అధికారులు, చందాదారులను పీఎఫ్ఆర్డీఏ కోరింది. ఈ డాక్యుమెంట్లలో ఏదైనా తప్పులు కనిపిస్తే.. అప్పుడు ఎన్‌పీఎస్ నిధులు నిలిచిపోయే అవకాశం ఉంది.
డబ్బు విత్ డ్రా చేసుకునే ముందు మీరు ఎన్‌పీఎస్ ఉపసంహరణ ఫారమ్‌ను అప్‌లోడ్ చేశారో లేదో నిర్ధారించుకోవాలి. గుర్తింపు కార్డు, అడ్రెస్ రుజువు ప్రకారం ఉపసంహరణ ఫారమ్‌లోని సమాచారాన్ని పూరించాలి. బ్యాంక్ ఖాతా ప్రూఫ్, పాన్ లేదా శాశ్వత పదవీ విరమణ ఖాతా నంబర్ కార్డ్ కాపీ కూడా ఉండాలి. ఈ పత్రాలలో దేనినైనా అప్‌లోడ్ చేయకపోతే.. ఎన్‌పీఎస్ నుంచి డబ్బును ఉపసంహరించుకోలేరు.
ఈ పత్రాలను అప్‌లోడ్ చేయండి
==> సీఆర్ఏ సిస్టమ్‌లో పత్రాలను అప్‌లోడ్ చేయడానికి లాగిన్ చేయండి.
==> ఈ-సైన్, ఎటీపీ వెరిఫికేషన్ అయిన తరువాత లాగిన్ కోసం రికెస్ట్‌ను పంపవచ్చు.
==> అభ్యర్థన సమయంలో చిరునామా, బ్యాంక్ వివరాలు, నామినీ వివరాలు వంటి సమాచారం అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
==> ఇప్పుడు సబ్‌స్క్రైబర్ ఏక మొత్తం యాన్యుటీ మొత్తాన్ని, వివరాలను ఎంచుకోవాలి.
==> ఆ తర్వాత మీ బ్యాంక్ ఖాతా ధృవీకరించాలి.
==> అలాగే గుర్తింపు, చిరునామా, పాన్ కార్డ్, బ్యాంక్ పాస్ బుక్ కేవైసీ పత్రాలను అప్‌లోడ్ చేయండి
==> స్కాన్ చేసిన డాక్యుమెంట్, స్కాన్ చేసిన ఫోటో ఉండాలి.
==> చందాదారుడు ఆధార్ సహాయంతో ఓటీపీ ద్వారా ఈ-సైన్ ఉపయోగించి ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
ప్రస్తుతం ఎన్‌పీఎస్ చందాదారులు మొత్తం కార్పస్‌లో 60 శాతం వరకు ఏకమొత్తంలో ఉపసంహరించుకోవచ్చు. అయితే కార్పస్‌లో 40 శాతం వినియోగించుకోవచ్చు. మీ మొత్తం ఎన్‌పీఎస్ కార్పస్ రూ.5 లక్షలు అయితే.. మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత సబ్‌స్క్రైబర్ ఈ మొత్తంలో 60 శాతం విత్‌డ్రా చేయగలరు. మరోవైపు మీరు మెచ్యూరిటీకి ముందు ఉపసంహరించుకుంటే.. మీరు కార్పస్‌లో 80 శాతం నుంచి యాన్యుటీని కొనుగోలు చేయాలి.
Also Read: Ram Charan Upasana: రామ్‌చరణ్ గురించి సీక్రెట్ బయటపెట్టిన ఉపాసన.. దయచేసి అలా చేయకండి
Also Read: Team India: రోహిత్ శర్మ వారసుడు రెడీ అవుతున్నాడు.. దూసుకువస్తున్న పాండ్యా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి