Paytm IPO Details: పేటీఎం మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ రూ.18,300 కోట్ల సమీకరణ లక్ష్యంతో పబ్లిక్ ఇష్యూకు (Paytm IPO) వస్తోంది. ఇందులో రూ.8300 కోట్ల కోసం తాజాగా షేర్లు జారీ చేస్తున్నారు. ఈ నిధులు మాత్రమే కంపెనీకి వెళ్తాయి. ప్రస్తుత ఇన్వెస్టర్లు ఆఫర్ ఫర్ సేల్ కింద రూ.10,000 కోట్ల విలువైన షేర్లు విక్రయిస్తున్నారు. ఇవి వారికి చెందుతాయి. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ ఇప్పటికే రూ.8235 కోట్లు సమీకరించింది.
ఈనెల 8న (Paytm IPO date) ప్రారంభమై, 10న ముగియనున్న ఈ ఇష్యూకు ధరల శ్రేణిని రూ.2080- 2150గా నిర్ణయించారు. మొత్తం ఇష్యూలో 10 శాతం షేర్లను రిటైలర్లకు కేటాయిస్తారు. రిటైలర్లు కనీసం 6 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంది. ఇష్యూ గరిష్ఠధర ప్రకారం చూస్తే ఇందుకు రూ.12,900 అవుతుంది. గరిష్ఠంగా ఒకరు 15 లాట్లకు దరఖాస్తు చేయొచ్చు. అంటే రూ.1,93,500 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
Also Read: Jio Phone next: జియోఫోన్ నెక్ట్స్ విక్రయాలు షురూ- కొనుగోలు ప్రక్రియ ఇదే..
Also Read: Evergreening: కస్టమర్ల సమ్మతి లేకుండానే రుణాలిచ్చేసిన బ్యాంకు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook