Quantino Twenty Five: భవిష్యత్‌లోని కార్ల మార్కెట్‌ను కేవలం ఎలక్ట్రిక్ కార్లే శాసిస్తాయి. డీజిల్, పెట్రోల్ కార్ల యుగం ఇంకా 2025 దాకా మిగిలి ఉంది. ఆ తర్వాత అన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లే విక్రయిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఎలక్ట్రిక్ కార్లలో లిథియం-అయాన్ బ్యాటరీలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కానీ కాలం గడిచే కొద్ది సాంకేతికత అభివృద్ధి పెరిగిపోతుంది. అయితే దానికి అనుగుణంగానే ఓ కంపెనీ అలాంటి ఎలక్ట్రిక్ కారును తయారు చేసింది. ఎలాంటి బ్యాటరీ లేకుండా ఈ కారు రోడ్ల పై పరుగులు పెట్టబోతోంది. ఎలాంటి ఛార్జింట్, బ్యాటరీ లేకుండా దాదాపు 2000కిలో మీటర్ల రేంజ్ మైలేజీని ఇస్తుందని సమాచారం. అయితే ఈ కారు ఏమిటి? దానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం..
మీకు ఈ రోజూ ఎలాంటి బ్యాటరీ లేకుండా చార్జింగ్ ఎలక్ట్రిక్ కారును పరిచయం బోతున్నాం. అదే క్వాంటినో ట్వంటీఫైవ్ (Quantino Twenty Five)..ఇది లిథియం అయాన్ బ్యాటరీకి బదులుగా సముద్రపు నీరు, పారిశ్రామల నుంచి ఉత్పత్తయ్యే వ్యర్థాల నుంచి నడుస్తుంది. అయితే ఇలా నడిచే కార్లలో ఇదే మొదటి కారు. త్వరలో ఈ కారు మార్కెట్‌లోకి రాబోతోంది. ఈ క్వాంటినో ట్వంటీఫైవ్ కారుకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంటుంది.
ట్యాంక్ నిండి సముద్రము నీరు ఫిల్ చేస్తే దాదాపు 2000 కి.మీ దాకా మైలేజీని ఇస్తుందని ఇటీవలే పలు వార్తలు వచ్చాయి. అయితే దీని ఇంజీన్ నుంచి వచ్చే పొగ వల్ల ఎలాంటి కాలుష్యం ఉండదు. ఇటివలే చాలా ఎలక్ట్రిక్ కార్ల వల్ల కూడా వాతావరణంలో కాలుష్యం ఏర్పడుతోంది. అలాంటి కార్లలాగా కాకుండా ఈ క్వాంటినో ట్వంటీఫైవ్‌కు చెందిన కారు ఎలాంటి కాలుష్యం లేకుండా వినియోగదారుల ముందుకు రానుంది.
ఈ కారు గరిష్టంగా 3 సెకన్లలోపు 0 నుంచి 100 kmph వేగం వరకు రోడ్డుపై దూసుకు వెళ్లనుంది. అయితే ఇది ఎలక్ట్రిక్ కారు కావడంతో నాయిస్ లేకుండా రెప్పపాటి వేగంతో పరిగెత్తననుంది. క్వాంటినో ట్వంటీఫైవ్ కొత్త డిజైన్ చాలా ఆకర్షణీయంగా కనిపించబోతోంది. ఇప్పటికే ఈ కారుకు సంబంధించిన చాలా ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.
Also read: Kalatapasvi K Viswanath Death : అందుకే ఆయన ఈరోజే చనిపోయారేమో.. కళాతపస్వి మృతిపై చిరు ట్వీట్
Also read: Kalatapasvi K Viswanath Death : అందుకే ఆయన ఈరోజే చనిపోయారేమో.. కళాతపస్వి మృతిపై చిరు ట్వీట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook