Smart Phone Under 15000 Rupees: రెడ్ మీ 12 స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ ఫోన్ ను థాయ్‌లాండ్‌లో విడుదల చేసింది షియోమీ. ఇది రెడ్మీ 11కి సక్సెసర్‌గా రాబోతుంది. ఈ ఫోన్ లో కెమెరా ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. పదిహేను వేల లోపు ధరలో ఇంతకంటే మంచి కెమెరా ఫోన్ రాదు. పైగా ఇది మీడియా టెక్ అక్టాకోర్ చిప్ సెట్ తో వస్తుంది.అంతేకాకుండా ఇది సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు AI ఫేస్ అన్‌లాక్ సపోర్ట్‌ను కలిగి ఉంది.
రెడ్ మీ 12 ధర
ఈ స్మార్ట్‌ఫోన్ ను మిడ్‌నైట్ బ్లాక్, స్కై బ్లూ మరియు పోలార్ సిల్వర్ కలర్స్‌లో లాంచ్ చేశారు. 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర దాదాపు రూ.12,516గా నిర్ణయించారు. 4GB / 8GB RAM మరియు 128GB / 256GB స్టోరేజ్ కలిగిన వేరియంట్‌ల ధరను వెల్లడించలేదు. ఈ ఫోన్‌ను థాయ్‌లాండ్‌లోని షాపీ మరియు లజాడా నుండి కొనుగోలు చేయవచ్చు. గ్లోబల్ మార్కెట్‌లో ఎప్పుడు లాంచ్ అవుతుందనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ మెుబైల్ ఫోన్ యెుక్క మెుత్తం ఫీచర్లు గురించి తెలుసుకుందాం.
రెడ్ మీ 12 ఫీచర్లు
- తెర (display): 6.79 అంగుళాల డిస్ప్లే, FHD+ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్
- ప్రాసెసర్: మీడియా టెక్ ఆక్టా-కోర్ 12nm Helio G88 చిప్ సెట్
- ర్యామ్ అండ్ స్టోరేజ్: 4GB RAM + 128GB, 8GB RAM + 128GB/256GB, మైక్రో SD కార్డ్ సపోర్టు.
- సాఫ్ట్‌వేర్: MIUI 14తో Android 13.
- బ్యాక్ కెమెరా: 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 2MP మాక్రో సెన్సార్
- ఫ్రంట్ కెమెరా: 8MP
- ఇతర ఫీచర్లు: సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, AI ఫేస్ అన్‌లాక్, IP53 రేటింగ్.
- కనెక్టివిటీ: డ్యూయల్ సిమ్ కార్డ్ స్లాట్‌లు, 4G LTE, Wi-Fi 802.11 b/g/n/ac, బ్లూటూత్ v5.3, USB టైప్-C పోర్ట్ .
- బ్యాటరీ: 5,000mAh, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.
Also Read: Amazon Prime Lite: రూ.999కే అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్.. బెనిఫిట్స్ ఇవే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి