Dangerous 7 Apps: ఈ యాప్స్ మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్నాయా..వెంటనే డిలీట్ చేయండి

Dangerous 7 Apps: స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తూ..యాక్టివ్‌గా ఉండేవారికి ఓ హెచ్చరిక. ప్రమాదకరమైన ఏడు యాప్స్ ఉన్నాయి. ఇవి మీ డబ్బుల్ని తస్కరించగలవు. ఆ యాప్స్‌ను వెంటనే తొలగించకపోతే మంచిదంటున్నారు సైబర్ నిపుణులు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 24, 2022, 10:01 AM IST
 Dangerous 7 Apps: ఈ యాప్స్ మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్నాయా..వెంటనే డిలీట్ చేయండి

Dangerous 7 Apps: స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తూ..యాక్టివ్‌గా ఉండేవారికి ఓ హెచ్చరిక. ప్రమాదకరమైన ఏడు యాప్స్ ఉన్నాయి. ఇవి మీ డబ్బుల్ని తస్కరించగలవు. ఆ యాప్స్‌ను వెంటనే తొలగించకపోతే మంచిదంటున్నారు సైబర్ నిపుణులు.

ప్రస్తుత తరుణంలో స్మార్ట్‌ఫోన్ జీవితంలో ఓ భాగంగా మారిపోయింది. ప్రతి పనికి యాప్స్ ఉన్నాయి. అయితే కొన్ని యాప్స్ ప్రమాదకరమైనవిగా ఉంటాయి. వీటిపట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రమాదకరమైన స్పైవేర్ ఎప్పటికప్పుడు గూగుల్ ప్లే స్టోర్‌లో చొచ్చుకుపోతుంటుంది. సైబర్ సెక్యూరిటీ కంపెనీ ట్రెండ్ మైక్రో..తాజా అధ్యయనం వెలువరించింది.ప్లే స్టోర్‌లో 2 వందల కంటే ఎక్కువ యాప్స్‌లో ఫేస్ స్టీలర్ పేరుతో ఓ ప్రమాదకరమైన స్పైవేర్ ఉందని వెల్లడించింది. ఇది యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేయడమే కాకుండా ఫేస్‌బుక్ పాస్‌వర్డ్ వంటి వివరాలు కూడా తస్కరిస్తుందట.

మరోవైపు 40 కంటే ఎక్కువ నకిలీ క్రిప్టోక్యూరెన్సీ మైనర్ యాప్స్ గురించి ఈ నివేదిక వివరించింది. ఇందులో క్రిప్టోకరెన్సీను దొంగిలించడం, యూజర్ అనుమతి లేకుండా రిక్వస్ట్ సమాచారాన్ని పంపించడం చేస్తుంటుంది. ఇందులో కొన్ని యాప్స్ అయితే ఇప్పటికే లక్షకు పైగా ఇన్‌స్టాల్ అయ్యాయి.

ప్రమాదకరమైన ఏడు యాప్స్

1. డైలీ ఫిట్‌నెస్ ఓఎల్
2. పనోరమా కెమేరా
3. బిజినెస్ మెటా మేనేజర్
4. స్వామ్ ఫోటో
5. ఎంజాయ్ ఫోటో ఎడిటర్
6. క్రిప్టోమైనింగ్ ఫామ్ యువర్ ఓన్ కాయిన్
7. ఫోటో గేమింగ్ పజిల్

ఈ అన్ని యాప్స్‌లో వేలాది ఇన్‌స్టాలేషన్స్ ఉన్నాయి. గూగుల్ ఇటీవల ఈ స్పైవేర్‌పై దృష్టి పెట్టింది.ఫేస్‌స్టీలర్ సంక్రమించిన యాప్స్‌ను వెంటనే డిలీట్ చేసింది. మీ స్మార్ట్‌ఫోన్స్‌లో ఈ యాప్స్ ఏమైనా ఉంటే..వెంటనే డిలీట్ చేయండి. లేకపోతే మూల్యం చెల్లించుకోవల్సి వస్తుంది.

Also read: Todays Gold Rate: మళ్లీ పెరుగుతున్న బంగారం, దేశంలో ఇవాళ మే 24న వివిధ నగరాల్లో బంగారం ధరలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4GApple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News