Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు మార్చి 14, 2021 Rasi Phalalu, ఓ రాశివారికి వాహనయోగం

Horoscope Today 14 March 2021: ఆకస్మిక ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 14, 2021, 08:36 AM IST
Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు మార్చి 14, 2021 Rasi Phalalu, ఓ రాశివారికి వాహనయోగం

Horoscope Today 14 March 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఆకస్మిక ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి మార్చి 14న సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.

మేష రాశి
మీరు కోరుకున్నట్లుగా చాలా ఉన్నతమైన స్థానంలో ఉంటారు. రోజు మీరు మీ సామర్థ్యాన్ని ఎక్కడ ఉపయోగించాలో తెలుసుకుంటారు. మీరు చేయగలిగినది మరెవరూ గుర్తించని పనిని సాధించడమే మీ ఘనతగా ప్రశంసలు పొందుతారు. కొన్ని పనులు వాయిదా పడతాయి. ఉద్యోగులు, వ్యాపారులకు అంతగా కలిసిరాదు. ప్రయాణాల కారణంగా ఆర్థిక సమస్యలు చికాకు తెప్పిస్తాయి.

Also Read: Telangana Graduate MLC Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే విధానం ఇదే, అలాచేస్తే మీ ఓటు చెల్లదు

వృషభ రాశి
మీరు మీ సహచరులకు ఏదైనా చెప్పాలనుకుంటే ఇది మంచి సమయం. వారు మీ సమస్యను అర్థం చేసుకుంటారు. వారికి తోచిన సలహా ఇచ్చి మీకు సహాయం చేసేందుకు ముందుకొస్తారు. తద్వారా మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీ తోటివారికి సమయాన్ని కేటాయించాలి. వారికి మాట్లాడటానికి అవకాశం ఇవ్వాలి. ఉద్యోగులకు సత్ఫలితాలు గోచరిస్తున్నాయి. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

మిథున రాశి
ప్రమోషన్ గురించి ఆలోచిస్తున్నారు. అయితే కొంత ఆలస్యం కానుంది గుర్తిస్తారు. వీటిని తట్టుకునేందుకు మీరు మానసికంగా సిద్ధం కావాలి. ప్రముఖులతో పరిచయం ఏర్పడుతుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. నిరుద్యోలకు అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారులకు లాభసాటిగా ఉండనుంది.

కర్కాటక రాశి
మీ ఆలోచనలకు నేడు శ్రీకారం చుడతారు. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా పనులలో జాప్యం తలెత్తుతుంది. ఖర్చులను అదుపులో ఉంచకపోతే మీ పరిస్థితి క్షీణిస్తుంది. దైవదర్శనాలు చేసుకోవాలని భావిస్తారు. ఉద్యోగులకు తీవ్ర ఒత్తిడితో పనులు ముందుకుసాగవు. వ్యాపారాలు అంతంతమాత్రమే ఉంటాయి.

Also Read: Shani Amavasya: చెడు ప్రభావం తగ్గాలంటే శని అమావాస్య రోజున పాటించాల్సిన విషయాలివే

సింహ రాశి
ఈ రోజు కార్యాలయంతో గుర్తించే సమస్యలను మీరు తప్పుగా భావిస్తారు. అయితే ప్రస్తుత పరిస్థితులు ఏంటన్నది గుర్తించాలి. మీ ఖర్చులు అధికం కావడంతో రుణాల కోసం యత్నిస్తారు. ఉద్యోగులు, వ్యాపారులు సత్ఫలితాల కోసం మరికొన్ని రోజులు వేచిచూడక తప్పదు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఉద్యోగులకు పని భారం అధికం కానుంది.

కన్య రాశి
కొన్ని ముఖ్యమైన పనులపై శ్రద్ధ వహించాలి. మీకు సహాయం చేయడానికి ఆలోచనలు పంచుకున్న వ్యక్తిపట్ల మీరు కృతజ్ఞతతో ఉండాలి. అదే సమయంలో అజాగ్రత్త పనికిరాదు. నేడు మీకు వాహనయోగం గోచరిస్తుంది. ఉద్యోగులకు తగిన గుర్తింపు లభిస్తుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.

తులా రాశి
కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు. తద్వారా పరిస్థితి మీకు అనుకూలించే సూచనలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో గతంలో మీకు రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. నూతన ఉద్యోగావకాశాలు తలుపు తట్టనున్నాయి.

వృశ్చిక రాశి
మీరు, మీ బంధువులందరూ కొన్ని విషయాలు అంగీకరిస్తే అంతా ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే ఓ విషయంలో భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది. త్వరలో పరిస్థితిలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. అధికంగా శ్రమించినా మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ దర్శనాలు మార్గంగా ఎంచుకుంటారు.

ధనుస్సు రాశి
ఈ రోజు మీకు కలిసొస్తుంది. కుటుంబసభ్యులు, సన్నిహితులతో సంతోషంగా గడపున్నారు. జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో మీరు తెలుసుకుంటారు. మీ సహాయం కోరిన వ్యక్తులకు సహకరించడమే మార్గంగా కనిపిస్తుంది. మీ రుణాలు తీరతాయి. వ్యాపారులకు లాభసాటిగా ఉండనుంది. 

Also Read: Maha Shivratri 2021: ఈ 7 పదార్థాలు, వస్తువులు శివుడికి సమర్పించకూడదని తెలుసా

మకర రాశి
భావోద్వేగాలను నియంత్రణలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని విషయాలు మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ప్రతి విషయాన్ని పూర్తిగా మార్చాల్సిన అవసరం లేదు. తలకు మించిన భారం మోయరాదు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేయనున్నారు. వస్తు లాభం గోచరిస్తుంది. పనిచేసే చోట మీ పనికి తగిన ప్రతిఫలం లభిస్తుంది.

కుంభ రాశి
మీకు నమ్మకంగా ఉండే వ్యక్తులను గుర్తించి వారితో స్నేహం చేస్తారు. ఆరోగ్యం క్షీణిస్తుంది. వ్యాపారులకు అంతగా కలిసిరాదు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు యత్నాలు. భూవివాదాలు పరిష్కారం కోసం తీవ్రంగా యత్నిస్తారు.

మీన రాశి
మీ సమయాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో మీరు గుర్తించాలి. భవిష్యత్ గురించి ఆలోచించి ఆందోళన చెందవద్దు. నూతన పరిచయాలతో కొత్త విషయాలు తెలుసుకుంటారు. వాహనయోగం. శ్రమిస్తే ఫలితం ఉంటుందని కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుడతారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News