Stocks For Best Returns: 4 నుండి 5 వారాల్లో అధిక లాభాల కోసం 5 స్టాక్స్

Stocks For Best Returns In 4 To 5 Weeks: ప్రస్తుతం ఐసిసి వరల్డ్ కప్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఐసిసి వరల్డ్ కప్ నిర్వహణలో భాగంగా ఆటగాళ్ల నుండి మొదలుపెడితే.. ఆట చూసేందుకు వచ్చే ఆడియెన్స్ వరకు చాలామందికి హోటల్లో బస చేసే అవసరం ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ఐసిసి వరల్డ్ కప్ వల్ల హోటల్ ఇండస్ట్రీ లాభపడుతుంది. అందుకే షేర్ ఖాన్ హోటల్ ఇండస్ట్రీపై అధ్యయనం చేసి పలు స్టాక్స్ కి బై రేటింగ్స్ ఇచ్చింది.

Written by - Pavan | Last Updated : Oct 12, 2023, 10:54 PM IST
Stocks For Best Returns: 4 నుండి 5 వారాల్లో అధిక లాభాల కోసం 5 స్టాక్స్

Stocks For Best Returns In 4 To 5 Weeks: స్టాక్ మార్కెట్‌లో అనేక కారణాల వల్ల సెన్సెక్స్ పాయింట్స్ లాభపడటం లేదా కింద నష్టపోవడం జరుగుతుంటుంది. స్టాక్ మార్కెట్ ని ఎన్నో అంశాలు ప్రభావితం చేస్తుంటాయి. ఆయా అంశాలు, పరిస్థితులనుబట్టి వాటికి సంబంధించిన రంగంలో ఉన్న కంపెనీలు లాభ పడటం లేదా నష్టపోవడం వంటివి జరుగుతుంటుంది. ప్రస్తుతం ఐసిసి వరల్డ్ కప్ జరుగుతున్న విషయం తెలిసిందే.

ఐసిసి వరల్డ్ కప్ నిర్వహణలో భాగంగా ఆటగాళ్ల నుండి మొదలుపెడితే.. ఆట చూసేందుకు వచ్చే ఆడియెన్స్ వరకు చాలామందికి హోటల్లో బస చేసే అవసరం ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ఐసిసి వరల్డ్ కప్ వల్ల హోటల్ ఇండస్ట్రీ లాభపడుతుంది. అందుకే షేర్ ఖాన్ హోటల్ ఇండస్ట్రీపై అధ్యయనం చేసి పలు స్టాక్స్ కి బై రేటింగ్స్ ఇచ్చింది. అవేంటో ఇప్పుడు చూద్దాం రండి.

హోటల్ అండ్ ట్రావెలింగ్ ఇండస్ట్రీలో ఒకటైన Lemon Tree Stock విషయానికొస్తే , అక్టోబర్ 10వ తేదీ నాడు లెమన్ ట్రీ స్టాక్ ధర రూ. 118 గా ఉండగా.. నాలుగైదు వారాల్లో ఈ స్టాక్ ధర రూ. 140 నుండి 150 వరకు పెరుగుతుంది అని షేర్ ఖాన్ అంచనా వేస్తోంది. రూ. 116 నుండి 120 మధ్య ఈ స్టాక్ ని కొనుగోలు చేసి 105 రూపాయల వద్ద స్టాప్ లాస్ పెట్టాల్సిందిగా సూచించింది.

Chalet Hotels విషయంలో కూడా షేర్ ఖాన్ కొనుగోలు చేయాల్సిందిగా ఇన్వెస్టర్స్ కి సలహా ఇస్తూ అక్టోబర్ 10 నాడు 594 రూపాయల వద్ద ట్రేడ్ అవుతున్న ఈ స్టాక్ మరో నాలుగైదు వారాల్లో రూ. 660 నుండి 700 వరకు పెరిగే అవకాశం ఉంది అని స్పష్టంచేసింది. రూ. 590 నుండి 600 మధ్యలో ఉండగా ఈ స్టాక్ ని సొంతం చేసుకోవాలన్న షేర్ ఖాన్.. రూ. 540 వద్ద స్టాప్ లాస్ పెట్టాల్సిందిగా స్పష్టంచేసింది. 

అక్టోబర్ 10 నాడు 217 రూపాయల వద్ద ట్రేడ్ అవుతున్న Devyani International Stock ని రూ. 214 నుండి 220 మధ్య కొనుగోలు చేస్తే.. మరో నాలుగైదు వారాల్లో ఈ స్టాక్ 250 నుండి 265 వరకు పెరిగే అవకాశం ఉందని షేర్ ఖాన్ సూచించింది. దేవయాని ఇంటర్నేషనల్ స్టాక్ కి రూ. 199 వద్ద స్టాప్ లాస్ పెట్టాల్సిందిగా షేర్ ఖాన్ రికమెండ్ చేసింది. 

Restaurant Brands Asia స్టాక్ అక్టోబర్ 10 నాడు రూ. 124 వద్ద ట్రేడ్ అవుతుండగా.. రూ. 122 నుండి 126 మధ్య ఈ స్టాక్ ని కొనుగోలు చేయాల్సిందిగా షేర్ ఖాన్ సూచించింది. వచ్చే నాలుగైదు వారాల్లో రెస్టారెంట్స్ బ్రాండ్స్ ఏషియా స్టాక్ రూ. 150 నుండి 165 మార్క్ తాకుతుంది అని షేర్ ఖాన్ అంచనా వేసింది.

షేర్ ఖాన్ సూచించిన స్టాక్స్ లో United Spirits స్టాక్ కూడా ఒకటి. ప్రస్తుతం రూ. 1053 వద్ద ఉన్న ఈ స్టాక్ రూ. 1100 నుండి 1150 వరకు పెరిగే అవకాశం ఉందన్న షేర్ ఖాన్.. స్టాప్ లాస్ రూ. 950 వద్ద పెట్టాల్సి ఉంటుంది అని షేర్ ఖాన్ స్పష్టంచేసింది. అక్టోబర్ 10 నాడు యునైటెడ్ స్పిరిట్స్ స్టాక్ ధర రూ. 1038 గా ఉండగా.. 1020 నుండి 1040 రూపాయల మధ్య షేర్స్ ట్రేడ్ అవుతున్నాయి. 

గమనిక: ఇక్కడ పేర్కొన్న స్టాక్స్ అన్నీ ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ షేర్ ఖాన్ అంచనాల మేరకే వెల్లడించడం జరిగింది కానీ ఇందులో జీ తెలుగు న్యూస్ సొంత అభిప్రాయాలు లేవు అని గమనించగలరు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే ముందు ఆయా స్టాక్స్ గురించి పూర్తిగా అధ్యయనం చేసిన తరువాత కానీ లేదా మీ బిజినెస్ అడ్వైజర్‌తో చర్చించిన తరువాత కానీ పెట్టుబడులపై నిర్ణయం తీసుకోగలరు.

Trending News