Bullish Stock: నెల రోజుల్లో రెట్టింపైన షేర్లు, ఇన్వెస్టర్లకు డబుల్ బొనాంజా

Bullish Stock: షేర్ మార్కెట్‌లో ఎప్పుడు ఏమౌతుందో ఎవరూ ఊహించలేరు. కొన్ని స్టాక్స్ నిరంతరం పైకి వెళ్తూ..ఇన్వెస్టర్లకు లాభాలు ఆర్జిస్తోంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 18, 2022, 10:10 PM IST
Bullish Stock: నెల రోజుల్లో రెట్టింపైన షేర్లు, ఇన్వెస్టర్లకు డబుల్ బొనాంజా

Bullish Stock: షేర్ మార్కెట్‌లో ఎప్పుడు ఏమౌతుందో ఎవరూ ఊహించలేరు. కొన్ని స్టాక్స్ నిరంతరం పైకి వెళ్తూ..ఇన్వెస్టర్లకు లాభాలు ఆర్జిస్తోంది.

షేర్ మార్కెట్‌లో కొన్ని షేర్లు బుల్లిష్ ట్రెండ్ కొనసాగిస్తున్నాయి. అంటే అదే పనిగా పెరుగుదల నమోదు చేస్తున్నాయి. పైకి ఎదుగుతూనే ఉన్నాయి. కొన్ని షేర్లు తక్కువ సమయంలోనే ఇన్వెస్టర్లకు దీపావళిని తెచ్చిపెట్టేశాయి. కేవలం నెల వ్యవధిలోనే ఇన్వెస్టర్ల పెట్టుబడిని రెట్టింపు చేశాయి.

నెలరోజుల్లోనే రెట్టింపు వృద్ధి నమోదు చేసిన షేర్లు టీఆర్ఎఫ్ లిమిటెడ్ కంపెనీవి. కేవలం నెల రోజుల వ్యవధిలో ఈ షేర్లు రెట్టింపుగా మారి..ఇన్వెస్టర్లకు ప్రయోజనం చేకూర్చాయి. దాంతోపాటు షేర్ కంటిన్యూగా పెరుగుతూనే ఉంది. 

నెల రోజుల్లో ఎంత రిటర్న్

టీఆర్ఎఫ్ షేర్ ఎన్ఎస్ఈలో 2022 ఆగస్టు 19న 152.50 రూపాయలకు క్లోజ్ అయింది. ఆ తరువాత ఈ షేర్ వరుసగా పెరుగుతూనే పోయింది. 2022 సెప్టెంబర్ 16న ఈ షేర్ 294.90 రూపాయలకు చేరుకుంది. అంటే నెలరోజుల్లో ఒక్కొక్క షేరుపై 93.38 రూపాయలు లాభం వచ్చింది. 

టీఆర్ఎఫ్ షేర్ 52 వారాల అత్యధిక ధర 294.90 రూపాయలుంది. అటు 52 వారాల కనిష్ట విలువ 106.10 రూపాయలుంది. టీఆర్ఎఫ్ సంబంధం నేరుగా టాటా స్టీల్‌తో ముడిపడి ఉంది. టీఆర్ఎఫ్ 75 శాతం ఆర్డర్ బుకింగ్స్ టాటా స్టీల్‌వే కావడం విశేషం.

Also read: Money Making Tips: ఇంట్లో కూర్చుని ఆన్‌లైన్‌లో డబ్బులు ఎలా సంపాదించడం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebok

Trending News