Volkswagen and Skoda: వోక్స్‌వేగన్, స్కోడా నుంచి నాలుగు కొత్త కార్లు, ధర, ప్రత్యేకతలు ఇలా

Volkswagen and Skoda: ప్రముఖ కార్ల కంపెనీ స్కోడా, వోక్స్‌వేగన్‌లు కొత్తగా నాలుగు మోడల్స్ కార్లు లాంచ్ చేశాయి. అద్భుతమైన ఫీచర్లు కలిగిన ఈ కార్ల ధర 11 లక్షల నుంచి ప్రారంభం కానుంది. పూర్తి వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 3, 2023, 06:42 PM IST
Volkswagen and Skoda: వోక్స్‌వేగన్, స్కోడా నుంచి నాలుగు కొత్త కార్లు, ధర, ప్రత్యేకతలు ఇలా

స్కోడా ఆటో, వోక్స్‌వేగన్ ఇండియా కంపెనీలు ఇండియా2.0 ప్రోగ్రాంలో భాగంగా కుశాక్, టైగున్, వర్టూస్, స్లావియా మోడల్ కార్లను లాంచ్ చేశాయి. ఇప్పుడీ కార్లకు కొత్త అప్‌డేటెడ్ ఫీచర్లు చేర్చారు. అద్భుతమైన ఫీచర్లు ఉండటంతో మార్కెట్‌లో మంచి విక్రయాలు జరుపుతున్నాయి. 

స్కోడా ఆటోలో కొత్తగా కుశాక్, స్లావియా మోడల్స్, వోక్స్‌వేగన్‌లో వర్టూస్, టైగున్ కార్లు లాంచ్ అయ్యాయి. ఇందులో కుశాక్ 11.59 లక్షలు కాగా, స్లానియా ధర 11.29 లక్షలుంది. ఇక వోక్స్‌వేగన్ కంపెనీ వర్టూస్ ధర 11.32 లక్షల రూపాయలైతే..టైగున్ ధర 11.56 లక్షలుంది. 

స్కోడా, వోక్స్‌వేగన్ అన్ని మోడల్స్‌లో ఎలక్ట్రిక్ సీట్ ఎడ్జస్ట్‌మెంట్, ఫుట్‌వేల్ ఇల్యూమినేషన్ వంటి కొత్త ఫీచర్లు చేరాయి. ఫలితంగా కార్ల డిజైరెబిలిటీ ఫ్యాక్టర్ పెరుగుతుంది. స్కోడా కుశాక్ సరికొత్త లావా బ్లూ కలర్‌లో అందుబాటులో ఉంది. కస్టమర్లకు ఇదొక కొత్త కలర్ ఆప్షన్. 

స్కోడా కుశాక్, స్లావియా ఇంజన్ ఆప్షన్లు

స్కోడా కుశాక్, స్లావియాలో 1.0 లీటర్ టీఎస్ఐ ఇంజన్ ఉంది. ఇందులో 6 స్పీడ్ ఎంటీ, 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో 1.5 లీటర్ టీఎస్ఐ ఇంజన్ లభిస్తుంది. 6 స్పీడ్ ఎంటీ, 7 స్పీడ్ డీఎస్జీతో వస్తోంది. కుశాక్ ఎక్స్‌షోరూం ధర11.59 లక్షల రూపాయలు కాగా, స్లావియా ధర 11.29 లక్షలుంది.

వోక్స్‌వేగన్ టైగున్, వర్టూస్ ఇంజన్ ఆప్షన్లు

వోక్స్‌వేగన్ టైగున్, వర్టూస్ మోడల్స్‌కు స్కోడా కుశాక్, స్లానియాలకు పెద్దగా తేడా లేదు. వర్టూస్ 1.5 లీటర్ టీఎస్ఐ ఇంజన్‌లో మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదు. కేవలం 7 స్పీడ్ డీఎస్జీతో వస్తుంది. వోక్స్‌వేగన్ టైగున్ ధర 11.56 లక్షల రూపాయలుంది. వర్టూస్ ధర 11.32 లక్షలుంది. 

Also read: Electric Scooter: ఎలక్ట్రిక్ స్కూటర్లలో అత్యధికంగా విక్రయమైన టాప్ 3 కంపెనీలివే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News